పాదాలు తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

బయటకు బహిర్గతం అయ్యే శరీర భాగాల్లో పాదాలు ఒకటి.అందుకే చాలా మంది తమ పాదాల పై ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటారు.

కానీ కొందరు మాత్రం పాదాల‌ను పెద్దగా పట్టించుకోరు.దీని కారణంగా మృతకణాలు పేరుకుపోతాయి.

పాదాలు నల్లగా మరియు డ్రై గా తయారవుతాయి.ఇక అప్పుడు పాదాలను చక్కదిద్దుకునేందుకు తిప్పలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? డోంట్ వర్రీ మీకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.ఈ క్రీమ్ ను నిత్యం నైట్ రాసుకుంటే మీ పాదాలు కొద్ది రోజుల్లోనే తెల్లగా మృదువుగా మారతాయి.

Advertisement
Natural Cream For White And Smooth Feet! Natural Cream, White And Smooth Feet, S

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్‌ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక క్యారెట్ టమాటో( Carrot ) మరియు నిమ్మ పండు తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసుకుని వాటర్ పోసి మెత్తని పేస్ట్ లా గ్రౌండ్‌ చేసుకోవాలి.

Natural Cream For White And Smooth Feet Natural Cream, White And Smooth Feet, S

ఈ పేస్ట్ నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్‌ వేసుకోవాలి.అలాగే ఐదు టేబుల్ స్పూన్లు క్యారెట్ టమాటో లెమన్ జ్యూస్( Lemon Juice ), చిటికెడు పసుపు( Turmeric ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఐదారు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో బాగా కలిపితే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.

Natural Cream For White And Smooth Feet Natural Cream, White And Smooth Feet, S
చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించేముందు పాదాల‌ను వాటర్ తో శుభ్రంగా కడిగి తడి లేకుండా ట‌వ‌ల్ తో తుడుచుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను పాదాలకు అప్లై చేసుకుని స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి.

Advertisement

చివ‌రిగా సాక్స్ ధరించి నిద్రించాలి.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే మీ పాదాలు తెల్లగా మృదువుగా మారతాయి.

అందంగా మెరుస్తాయి.కాబట్టి తెల్లటి మృదువైన పాదాలను కోరుకునే వారు తప్పకుండా ఈ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు