హైదరాబాద్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు తన ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తాను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో చేశామన్న ఎమ్మెల్యే మైనంపల్లి తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేయనని తెలిపారు.ఉద్యమ సమయంలో కూడా ఎక్కడ రాజీపడలేదన్నారు.
మెదక్ ప్రజలే తనకు రాజకీయ భిక్ష పెట్టారన్న ఆయన కార్యకర్తలు, ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.ఈ క్రమంలోనే ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగా ఉంటానని స్పష్టం చేశారు.
ప్రజల మద్ధతుతోనే విజయం సాధిస్తామన్నారు.ఈ మేరకు వారం రోజుల తరువాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి తెలిపారు.