నాని చాలా కాలం తర్వాత ఆ ఘనత దక్కించుకున్నాడు.. ఇక ఫుల్ జోష్‌

నాని హీరోగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించిన శ్యామ్‌ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాకు ట్యాక్సీ వాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

నాని ద్వి పాత్రాభినం చేసిన ఈ సినిమా కు భారీ వసూళ్లు నమోదు చేశాయి.విడుదల అయిన అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్ ను సాధించింది.

ఈమద్య కాలంలో విడుదల అయిన సినిమాల్లో చాలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ నిరాశ పర్చాయి.దాంతో శ్యామ్‌ సింగ రాయ్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ భరితంగా మారింది.

నాని హీరోగా నటించిన శ్యామ్‌ సింగరాయ్ ని జనాలు అన్ని ఏరియాల్లో కూడా ఆధరించి మంచి విజయాన్ని కట్టబెట్టారు.ప్రతి ఒక్క ఏరియాలో కూడా సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో నిర్మాతలకు మంచి లాభాలు రావడం మాత్రమే కాకుండా బయ్యర్లకు మంచి వసూళ్లు లాభాలు దక్కాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నాని నటించిన సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించక చాలా కాలం అయ్యిందని.ఈ సినిమా తో ఆయన సినిమా బయ్యర్లకు లాభాలు దక్కాయి అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నాని నటించిన జెర్సీ సినిమా టాక్ పాజిటివ్‌ అయినా కూడా వసూళ్ల విషయంలో నిరాశ పర్చింది.

జాతీయ అవార్డు వచ్చిన ఆ సినిమా బయ్యర్ల కు కాస్త లోటును మిగిల్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.ఆ తర్వాత కూడా నాని నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు.వి మరియు ట్రక్ జగదీష్ లు ఎలాగూ ఓటీటీ లో రావడం వల్ల బ్రేక్‌ ఈవెన్ టాక్ లేదు.

  కాని ఆ రెండు సినిమా లు కూడా పెద్దగా ఓటీటీ లో కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు అనేది టాక్‌.మొత్తానికి నాని చాలా కాలం తర్వాత శ్యామ్‌ సింగ రాయ్ తో ఒక మంచి విజయాన్ని దక్కించుకుని బ్రేక్ ఈవెన్ ను దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

ముందు ముందు అన్ని కూడా ఇలాంటి సినిమా లనే ఆయన చేయాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు