సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీలో నాని.. ఏ సినిమాలో అంటే?

ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల్లో మరో స్టార్ హీరో భాగం కావడం చూస్తూనే ఉన్నాం.

అది కూడా భాషతో సంబంధం లేకుండా పక్క భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్ పాత్రలలో క్యామియో రోల్స్ పోషిస్తూ ఆ సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

మేకర్స్ కూడా వేరే భాషల్లో స్టార్ హీరో అయితే అక్కడ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు.

అందులో ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియన్ సినిమాలు కావడంతో మేకర్స్ ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు.మరి మన టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన నాని కూడా ఇప్పుడు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) సినిమాలో కీ రోల్ చేయబోతున్నాడు అనే టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.ప్రెజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా జైలర్( Jailer Movie ).ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ భారీగా నిర్మిస్తుండగా ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.అయితే ఈ సినిమా తర్వాత రజనీకాంత్ జై భీమ్ డైరెక్టర్ టి జి జ్ఞ్యానవేల్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు అనే విషయం తెలిసిందే.

ఒక సాలిడ్ ప్రాజెక్ట్ ను రజనీకాంత్ తో ఈయన చేయబోతున్నట్టు కోలీవుడ్ మీడియా చెబుతుంది.

Advertisement

జ్ఞ్యానవేల్ తో రజినీకాంత్ తన 170వ సినిమా చేయనుండగా ఈ సినిమాలో న్యాచురల్ స్టార్ నాని కూడా కనిపిస్తాడు అని రూమర్స్ వస్తున్నాయి.నాని అందులో ఒక ముఖ్యమైన రోల్ లో నటిస్తున్నాడు అనే టాక్ తమిళ్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది.చూడాలి ఈ బజ్ ఎంత వరకు నిజం అనేది.

ఇక దసరా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న నాని ఇప్పుడు హాయ్ నాన్న( Hi Nanna ) సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు