ముద్దుకు ఎంత పట్టుబట్టినా నాని వద్దన్నాడట.. ఎందుకో తెలుసా?

యంగ్‌ హీరో నాని తాజాగా జెర్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.శ్రద్దా శ్రీనాద్‌ హీరోయిన్‌గా రూపొందిన ఈ చిత్రంకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటున్న ఈ చిత్రం నాని కెరీర్‌లోనే నిలిచి పోయే సినిమాగా నిలిచింది.భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందిన జెర్సీ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమా మాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.

భారీ ఎత్తున అంచనాలున్న ఇలాంటి సినిమాలో కాస్త కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జొప్పించి ఉంటే ఫలితం తారా స్థాయిలో ఉండేది.ఈ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జొప్పించేందుకు దర్శకుడు గౌతమ్‌ ఆసక్తి చూపించలేదట.

అయితే ఈ చిత్రంలో యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు ముద్దు సీన్‌లను పెట్టాలనుకున్నాడు.రెండు ముద్దు సీన్స్‌ను తన స్క్రిప్ట్‌లో దర్శకుడు గౌతమ్‌ పెట్టాడు.

Advertisement

అయితే సినిమా షూటింగ్‌ సమయంలో హీరో నాని ఆ సీన్స్‌కు నో చెప్పాడు.ఆహా కళ్యాణం సమయంలో హీరోయిన్‌తో నాని ముద్దు సీన్‌ ఉంది.

అయితే ఆ సీన్‌ నాని భార్యకు ఇబ్బంది పెట్టిందట.నాని భార్య అంజనా ఆ సీన్‌ విషయంలో చాలా ఇబ్బంది పడిందట.

అందుకే అప్పటి నుండి నాని ముద్దు సీన్స్‌కు పూర్తి దూరంగా ఉంటున్నాడు.

జెర్సీ చిత్రంలో ముద్దు సీన్‌కు చాలా స్కోప్‌ ఉంది.ఇద్దరి మద్య ఉన్న ప్రేమను చూపించేందుకు దర్శకుడు ముద్దు సీన్‌ పెట్టాలని బలంగా అనుకున్నా కూడా దర్శకుడి మాటను నాని తిరష్కరించాడట.జర్సీలో ముద్దు సీన్‌ ఉంటే మరింత ఆసక్తికరంగా ఉండేది అనేది ఇప్పుడు టాక్‌ నడుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

నాని ముద్దు సీన్‌ను వద్దనడం వల్ల కొంతలో కొంత అయినా నష్టం జరిగిందని సినీ వర్గాల వారు అంటున్నారు.చిత్ర నిర్మాతలు కూడా ఇదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నాని భవిష్యత్తులో కూడా ముద్దు సీన్‌లు చేసేందుకు ఆసక్తి చూపక పోవచ్చు.

తాజా వార్తలు