న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు.ఎందుకంటే ఈయన మొదటి నుండి విభిన్న కథలతో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టు కుంటూ వచ్చాడు.
ఏ సినిమా చేసిన తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటాడు.ఇక కీర్తి సురేష్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కీర్తి కూడా మహానటి తర్వాత అన్ని కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తుంది.మరి ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు నటిస్తున్న సినిమా ‘దసరా’. ఈ సినిమా వీరిద్దరిని మరో మెట్టు ఎక్కేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ చూస్తుంటే ఇదే క్లారిటీ అందరికి వచ్చేసింది.
శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.ఈ సాలిడ్ మాస్ సినిమాలో నాని, కీర్తి సురేష్ ఇద్దరు కూడా రెగ్యురల్ ఫార్మాట్ ను పక్కన పెట్టి సరికొత్త గెటప్స్ లో కనిపించ బోతున్నారు.పూర్తి స్థాయిలో గ్లామర్ ను పక్కన పెట్టి గుడిసెలో ఉండే సింగరేణి కార్మికుల తరహాలో కనిపించి డీ గ్లామర్ పాత్రల్లో మెప్పించ బోతున్నారు.

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకోవడంతో నాని, కీర్తి వెంటనే మరో లుక్ లో మారిపోయిన విధానం ఇప్పుడు వైరల్ అవుతుంది.వీరిద్దరూ కూడా దసరా సినిమా సెట్ లో వారి పాత్రలతో దిగిన సెల్ఫీతో పాటు లేటెస్ట్ సరికొత్త లుక్స్ తో దిగిన మరొక సెల్ఫీ ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ అయ్యింది.ఈ రెండు పిక్స్ చూసిన ఫ్యాన్స్ డెడికేషన్ అంటే వీరిలా ఉండాలని పొగిడేస్తున్నారు.ఇక 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.