జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనసూయ ఈ మధ్యకాలంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ముఖ్యంగా అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసే కొన్ని పోస్టుల వల్ల తనని ట్రోల్ చేసే వారి సంఖ్య అధికమవుతుంది ఇలా ఎంతో మంది నేటిజన్స్ నుంచి భారీ స్థాయిలో ట్రోలింగ్స్ ఎదుర్కొన్నప్పటికీ ఈమె మాత్రం తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోకుండా ట్రోలర్స్ కు తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.అయితే తాజాగా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు.

ఈ వీడియోలో భాగంగా ఈమె తనకు ఒక డిజాస్టర్ ఉందని నిజాలు చెప్పడం, నెగిటివ్ గా మాట్లాడే వారిని లెక్క చేయకపోవడం అంటూ సమాధానం చెప్పుకొచ్చారు.తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడిన ట్రోల్ చేసిన తాను అలాంటి వాటిని ఏమాత్రం పట్టించుకోనని తనకు తోచినదే తాను చేస్తూ నేను నేను గా ఉంటానని ఈ వీడియో ద్వారా అనసూయ తెలియచేశారు.ప్రస్తుతం అనసూయ తన గురించి తాను చేసుకున్నటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







