కుప్పం పర్యటనలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు..హైకోర్టు విచారణ

చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదైంది.అయితే పోలీసులపై హత్యాయత్నం చేశారని కేసు పెట్టడాన్ని టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు.

 Attempted Murder Case Against Tdp Leaders During Kuppam Visit.. High Court Inves-TeluguStop.com

కాగా ఈ కేసులో పది మందికి హైకోర్టు మధ్యంతర, ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్వు కోర్టులో వాదనలు వినిపించారు.

పిటిషనర్లపై ఐపీసీ సెక్షన్ 307 నమోదు చేసేందుకు తగిన కారణాలు లేవని న్యాయస్థానానికి తెలిపారు.తమ పార్టీ అధినేత వస్తున్నప్పుడు అక్కడకు వెళ్తుండగా అడ్డుకోవడమే కాకుండా లాఠీఛార్జ్ చేశారని పేర్కొన్నారు.23 మంది పోలీసులపై హత్యాయత్నం సాధ్యమేనా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో పిటిషనర్ తరపు లాయర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

అనంతరం తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపడతామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube