ఖగోళం అనేది అనేక అద్భుతాలకు, వింతలకు నిలయం.మన ఖగోళ శాస్త్రవేత్తలు ఎల్లవేళలా దానిపై పరిశోధనలు చేస్తూ పలు వివరాలను సేకరిస్తూ వుంటారు.
ఈ క్రమంలోనే అనేకానేక విషయాలను విశ్వమానవాళికి అందిస్తూ వుంటారు.ఐతే ఇప్పటివరకూ 2 బ్లాక్‌హోల్స్ ఢీకొట్టుకోవడాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడూ చూడనేలేదు.
మొట్ట మొదటి సారిగా అలాంటి విషయం గురించి పరిశీలిస్తున్నారు.కాగా ఆ 2 కృష్ణబిలాలూ రోజురోజుకూ దగ్గరవుతున్నాయి అని వారి పరిశోధనలో తేలింది.

కృష్ణబిలాలు గురించి మనం చిన్నప్పటినుండి పాఠ్యపుస్తకాలలో చదువుకుంటూనే వున్నాం.వాటి వేగం అనంతం, వాటి శక్తి అపారం అని అందరికీ తెలిసినదే.అందుకే శాస్త్రవేత్తలు దీనిపై ఎంతో ఆసక్తిని కనబరుస్తూ పరిశోధనలు చేస్తూ వుంటారు.ఈ కృష్ణబిలాలు మన భూమికి 750 కాంతి సంవత్సరాల అవతల ఉన్నాయి.అందుకే అవి రెండూ ఎప్పుడూ కలవవు.అందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇదివరకు ఎప్పుడూ ఇంత దగ్గరగా వస్తున్న బ్లాక్‌హోల్స్‌ని మనుషులు చూడలేదని ఈ అధ్యయన రచయిత అయిన చియారా మింగారెల్లి ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో రాశారు.

ఈ నేపథ్యంలో కృష్ణబిలాలను గమనించేందుకు వారు 7 టెలిస్కోపుల డేటాను పరిశీలిస్తున్నట్టు సమాచారం.ఈ దశలోనే శాస్త్రవేత్తలకు ఓ సవాల్ ఎదురైంది.అదేమంటే ఆ బ్లాక్ హోల్స్‌కి ముందు అత్యంత కాంతివంతమైన నక్షత్రాలు, వేడి వాయువులు గుంపులుగా వున్నాయట.
వాటిని దాటి బ్లాక్ హోల్స్‌ని చూడటానికి ఆప్టికల్ టెలిస్కోప్‌లు సరిపోవట్లేదు.అవి అత్యంత కాంతిమంతంగా ఉండి.వాటి కాంతి వల్ల.బ్లాక్ హోల్స్‌ని చూడటం కష్టమవుతోంది.
అయినా పరిశీలిస్తున్నారు.ఈ క్రమంలోనే భయంకరమైన విషయం వారు తెలుసుకున్నారు.
చాలా గెలాక్సీల మధ్యలో అతి పెద్ద బ్లాక్‌హోల్స్ చుట్టూ ఉన్న వాయువులు, నక్షత్రాలు, దుమ్మును లాగేసుకుంటూ.నానాటికీ సైజ్ పెంచుకుంటూ ఉన్నాయి.
రెండు బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న గెలాక్సీలు ఢీకొట్టుకున్న తర్వాత… బ్లాక్ హోల్స్ కలిసిపోయి.ఒకటే భారీ కొత్త గెలాక్సీ ఏర్పడగలదు అని చెబుతున్నారు.
ఇక అలాంటి సమయంలో అత్యంత శక్తిమంతమైన ఆకర్షణ తరంగాలు రిలీజ్ అయినప్పటికీ భూమికి ఆపద వచ్చే అవకాశం లేదని తెలిపారు.







