ఎన్టీఆర్‌ పై హాలీవుడ్‌ ప్రశంసలు.. తెలుగు మీడియా దాచే ప్రయత్నం చేస్తోందా?

ఆర్‌ఆర్ఆర్‌ సినిమా కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి.

గోల్డెన్ గ్లోబ్‌ అవార్డుల వేడుక సందర్భగా రాజమౌళి పై హాలీవుడ్‌ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే.

అవతార్ ఫిల్మ్‌ మేకర్‌ కూడా రాజమౌళి మరియు హీరోల గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు అంటూ ప్రచారం జరిగింది.రాజమౌళి తో పాటు ఎన్టీఆర్‌ గురించి ప్రధానంగా హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ మాట్లాడారు.

అంతే కాకుండా ఎన్టీఆర్ గురించి ఎక్కువగా హాలీవుడ్‌ మీడియా ఫోకస్ చేసిందని.కానీ తెలుగు మీడియా మాత్రం ఎన్టీఆర్‌ ను చిన్న చూపు చూస్తున్నారు అన్నట్లుగా నందమూరి అభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ పై హాలీవుడ్‌ ప్రముఖులు మరియు హాలీవుడ్‌ మీడియా చేసిన ప్రశంసలను ఏ ఒక్క తెలుగు మీడియా కవర్‌ చేయలేదు ఎందుకు అంటూ కొందరు నందమూరి అభిమానులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

కేవలం మెగా ఫ్యామిలీ మద్దతు కోసమే మీడియా వారు ఎన్టీఆర్‌ యొక్క క్రేజ్ ను దాచే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో జరిగిన ఈ చర్చలో నందమూరి అభిమానుల తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కనిపించారు.రామ్‌ చరణ్ విషయంలో చిన్న చూపు చూసినట్లు అవుతుంది అనే ఉద్దేశ్యంతో మీడియా వారు ఎన్టీఆర్ గురించి ఎక్కువగా కథనాలు రాయడం లేదు అంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి మీడియా ఉన్నందుకు బాధ పడాల్సి వస్తుంది అంటూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.ఎన్టీఆర్‌ కు కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కిన మాట వాస్తవమే.

కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే కాకుండా రామ్‌ చరణ్ కూడా అల్లూరి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించాడు అంటూ హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ కామెంట్స్ చేశారు.

నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?
Advertisement

తాజా వార్తలు