కొలీజియం వ్యవస్థపై వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది.కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కొలీజియంకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కొందరు రాజ్యాంగానికి అతీతులని అనుకుంటున్నారని ఆరోపించారు.ఢిల్లీ హైకోర్టు మాజీ జస్టిస్ ఆర్ఎస్ సోథి ఇంటర్వ్యూ వీడియోను పోస్ట్ చేసిన మంత్రి కిరణ్ రిజిజు తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు.
మెజార్టీ ప్రజలు ఇలాంటి వివేకమంతమైన అభిప్రాయాన్నే కలిగి ఉన్నారని తెలిపారు.కాగా కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు.