బాబోయ్‌ బాలయ్య... నీకు మాత్రమే ఇంతగా ఎలా సాధ్యం!

నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా యమ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.

స్పీడ్ గా సినిమాలను మెగాస్టార్ చిరంజీవి కూడా కమిట్ అవుతున్నాడు, కానీ వాటిని చేసేందుకు కింద మీద పడుతున్నాడు.

ఒక్కొక్క సినిమా విడుదలకు ఏడాదికి పైగా సమయం తీసుకుంటున్నాడు.వచ్చే ఏడాదిలోనే అయినా చిరంజీవి రెండు మూడు సినిమాలు విడుదల అయితాయేమో చూడాలి.

మరో వైపు నందమూరి బాలకృష్ణ మాత్రం సినిమాల ఎంపిక విషయంలో ఎంత స్పీడ్ గా ఉంటున్నాడో తన సినిమాల విడుదల విషయంలో కూడా అంతే స్పీడుగా ఉంటున్నాడు.ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న బాలకృష్ణ ఆ వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాలు కాకుండా బాలకృష్ణ మరో సినిమా కూడా ఒప్పుకున్నాడు అంటూ సమాచారం అందుతుంది.

Nandamuri Balakrishna Green Signal For One More Movie , Nandamuri Balakrishna, M
Advertisement
Nandamuri Balakrishna Green Signal For One More Movie , Nandamuri Balakrishna, M

ఈ మధ్య కాలంలో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తెలుగులో వరుసగా మంచి సినిమాలు పాపులారిటీ ఉన్న హీరోలతో చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు వారు బాలకృష్ణతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.భారీ మొత్తంలో ఖర్చు చేసి బాలకృష్ణతో ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను నిర్మించాలని సితార ఎంటర్టైన్మెంట్ వంశీ కోరుకుంటున్నాడు.

త్రివిక్రమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ సితార ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రతి సినిమాలో కచ్చితంగా ఉంటుంది.ఒకవేళ త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాలకృష్ణ సినిమా రేంజ్ మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి బాలయ్య మూడు సినిమాల్లో ఒక సినిమా ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది, రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తాయని అంటున్నారు.ఈ మూడు సినిమాలు కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి.

అందుకే ఆయన స్వీట్ ని చూసి ఇంత స్పీడు సినిమాలు నీకే సాధ్యం అంటూ కొందరు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మైత్రీ నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం.. అన్ని వందల కోట్లు రాబట్టాలా?
Advertisement

తాజా వార్తలు