ఉమ్మడి నల్లగొండ హస్తగతం...ఆ ఒక్కటి తప్ప...!

నల్లగొండ జిల్లా:నరాలు తెగే ఉత్కంఠతో రాష్ట్రం మొత్తం ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది.ఎవరి తలరాత ఏమిటో చెప్పి వెళ్ళిపోయింది.

ఆదివారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం నుండే కాంగ్రెస్ అధిక్యం కనబరిచింది.మొదటి రౌండ్ నుండి మొదలైన హస్తం హవా ఏ రౌండ్ లోనూ తగ్గకుండా కొనసాగింది.

రౌండ్ రౌండ్ కి ఆధిక్యం పెంచుకుంటూ విజయం దిశగా దూసుకుపోయింది.కాంగ్రెస్ వేవ్ చూసి కొందరు బీఆర్ఎస్ అభ్యర్దులు ( BRS Candidates )మధ్యలోనే కౌంటింగ్ కేంద్రాలను వదిలి వెళ్ళిపోయారంటే హస్తం హవా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కానీ,ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రం మంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) ఒంటరి పోరాటం చేసి చివరికి క్లీన్ స్వీప్ కాకుండా అడ్డుకో గలిగారు.సూర్యాపేట అభ్యర్ధి ప్రకటనలో అధిష్టానం చేసిన ఆలస్యం,ప్రచారానికి సమయం లేకపోవడం,మంత్రితో పోటీపడి డబ్బు పంపిణీ చేయకపోవడం వల్లనే సూర్యాపేటను కాంగ్రెస్ కోల్పోవాల్సి వచ్చిందని పేట కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

ఇక మూడు జిల్లాల వారీగా చూస్తే నల్లగొండ ఆరుకు ఆరు,యాదాద్రి భువనగిరి రెండుకు రెండు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా, సూర్యాపేటలో నాలుగింటిలో మూడు కైవసం చేసుకోగా, సూర్యాపేట ఒక్కటి బీఆర్ఎస్ విజయం సాధించింది.ఉమ్మడి జిల్లాలో హస్తం పార్టీకి వచ్చిన స్థానాలు,కాంగ్రెస్ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీని చూస్తే ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాదు ఆగ్రహంతో ఓటేశారని అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులంతా నుండి 72వేల భారీ మెజారిటీతో గెలుపొందగా,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణలోనే భారీ మెజారిటీ 72 వేలతో గెలిచి రికార్డ్ నెలకొల్పడం గమనార్హం.ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి అసెంబ్లీలో అడుగు పెట్టేది వీరే.

నల్లగొండ-కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), మునుగోడు-కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (కాంగ్రెస్)నకిరేకల్ -వేముల వీరేశం (కాంగ్రెస్),దేవరకొండ - నేనావత్ బాలూ నాయక్ (కాంగ్రెస్),మిర్యాలగూడ -బత్తుల లక్ష్మారెడ్డి(కాంగ్రెస్), నాగార్జున సాగర్- కుందూరు జైవీర్ రెడ్డి (కాంగ్రెస్),హుజూర్ నగర్ - నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్),కోదాడ - నలమాద పద్మావతి రెడ్డి (కాంగ్రెస్),తుంగతుర్తి - మందుల సామేల్(కాంగ్రెస్), సూర్యాపేట -గుంటకండ్ల జగదీష్ రెడ్డి (బీఆర్ఎస్).ఇందులో జై వీర్ రెడ్డి (సాగర్), బత్తుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ),మందుల సామేల్ (తుంగతుర్తి) జిల్లా నుండి తొలిసారి అసెంబ్లీలో అధ్యక్షా.

అనడానికి సిద్ధమవగా,మిగిలిన వారు మాజీ ఎమ్మెల్యేలే.

పైలట్ ప్రాజెక్టు భూ సర్వే ఎల్లాపురం శివారులో షురూ
Advertisement

Latest Nalgonda News