Nagarjuna : 10 మినిట్స్ అంటూ నాగార్జునతో ఆ మాట చెప్పిన సీరియల్ నటి… మన్మధుడుకే జలక్!

సాధారణంగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు ఇక ఏదైనా పండుగలు వచ్చిన లేదంటే స్పెషల్ డే కనుక ఉంటే తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి ఈవెంట్స్ ఏర్పాటు చేస్తారనే విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సంక్రాంతి( Sankranthi ) పండుగ త్వరలోనే రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అన్ని బుల్లితెర చానల్స్ వివిధ రకాల ఈవెంట్స్ ప్లాన్ చేసారు.

ఈ క్రమంలోనే స్టార్ మా వాళ్లు కూడా ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నా సామిరంగ ( Naa Saamiranga ) అనే ఈవెంట్ ప్లాన్ చేశారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమంలో స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్ నటీనటులు అలాగే బిగ్ బాస్ ( Bigg Boss ) కంటెస్టెంట్ లందరూ కూడా పాల్గొని సందడి చేశారని తెలుస్తుంది.ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున ( Nagarjuna ) కూడా హాజరయ్యారు ఈయన నటించిన నా సామి రంగ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్లలో భాగంగా ఈ కార్యక్రమంలో నాగార్జున సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమం నుంచి విడుదల చేసినటువంటి ప్రోమోలో భాగంగా నాగార్జున వేదికపై మాట్లాడుతూ ఉండగా బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య( Serial Actress Kavya ) నాగార్జున వద్దకు వచ్చి చాలా ధైర్యంతో నాగార్జున గారు మీరు 10 నిమిషాల పాటు నన్ను మీ అమల ( Amala ) అనుకోండి అంటూ నాగార్జునకు షాక్ ఇచ్చారు.ఈమె ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు.అనంతరం కావ్య నాగార్జునతో కలిసి పలు రొమాంటిక్ స్టెప్స్ వేశారు దీంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా ఎంతో నవ్వుకున్నారు.

Advertisement

ఇలా నన్ను అమల అనుకోండి అంటూ ఈమె ఆయనతో కలిసి డాన్స్ వేయడంతో నాగార్జున షాక్ అవ్వడమే కాకుండా అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ నాగార్జున కామెంట్ చేయడం విశేషం.ఇక ఈ కార్యక్రమం సంక్రాంతి పండుగ రోజున ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.ఇక ఈ వీడియో పై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గా కావ్య ఫిక్స్ అంటూ కొందరు కామెంట్లు చేయగా కావ్య సో ఫన్నీ అంటూ మరికొందరు ఈ వీడియో పై కామెంట్ చేయటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు