పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున చేసిన ఈ త్యాగం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.

కెరీర్ తొలినాళ్లలో పవన్ నటించిన సినిమాలలో ఎన్నో సినిమాలు సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాయి.

పవన్ హీరోగా అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు మూవీ ( Thammudu )ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఈ సినిమా కోసం కథ సిద్ధమైన సమయంలో ఈ మూవీకి తమ్ముడు అనే టైటిల్ తప్ప మరో టైటిల్ బాగుండదని భావించారట.

అయితే అప్పటికే నాగార్జున ఈ టైటిల్ ను రిజిష్టర్ చేయించుకున్నారట.తమ్ముడు సినిమా మేకర్స్ ఈ టైటిల్ కోసం నాగార్జునను ఫోన్ ద్వారా సంప్రదించగా నాగ్ మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా ఈ టైటిల్ ను త్యాగం చేశారని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున ( Nagarjuna )చేసిన ఈ త్యాగం గురించి తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.

Advertisement

నాగార్జున ప్రస్తుతం విజయ్ బిన్నీ డైరెక్షన్ లో నా సామిరంగ సినిమాలో ( Naa Saamiranga Movie )నటిస్తుండగా నా సామిరంగ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.నాగార్జున రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉంది.ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అంతుకుంటున్న నాగ్ వరుస విజయాలు సాధిస్తే రెమ్యునరేషన్ ను పెంచనున్నారు.

నాగచైతన్య, అఖిల్ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదు.అక్కినేని హీరోలకు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బ్లాక్ బస్టర్ హిట్లు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. అక్కినేని హీరోలకు కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కితే మాత్రం ఈ హీరోలకు తిరుగుండదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2024 సంవత్సరం నాగార్జునకు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాగ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని రేంజ్ లో పెరగనుంది.

Advertisement

తాజా వార్తలు