నగరి టిక్కెట్టు “భాను” కే.. “రోజా ఆశలు” గల్లంతు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఇప్పుడు టిడిపి వైసీపీలకి ఎంతో కీలకమైన నియోజకవర్గం అయ్యింది.

గాలి ముద్దు కృష్ణమ నాయుడు హఠాన్మరణంతో నగరిలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

ఇప్పుడు నగరిలో సీటు ఎవరికీ అన్న విషయంపై గత కొన్ని నెలలుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతానికి నగరి భాద్యతలని బుజాన వేసుకుని మరీ ముద్దు కృష్ణమ నాయుడు కొడుకు భాను ప్రకాష్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

అంతేకాదు తన తండ్రి బ్రతికి ఉన్న సమయంలో కూడా నగరి భాద్యతలు భాను నే దగ్గర ఉంది చూసుకునే వారు.ఇప్పుడు కూడా తన తండ్రి లేని లోటుని అక్కడ ఎంతో భాద్యతగా నిర్వహిస్తున్నారు.

ఇంటింటికి తెలుగుదేశం.సభ్యత్వ నమోదు వంటి కార్యక్రమాలు ఇలా పార్టీ ఆదేసించిన అన్ని పనులని చకచక పూర్తీ చేస్తూ అధినేత దృష్టిలో పడ్డారు.

Advertisement

అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా సరే ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు జగదీష్ కూడా నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.జగదీష్ …మామ సుబ్రహ్మణ్యం నాయుడు.

కర్ణాటక బీజేపీ నేత.మాజీ మంత్రి కూడా.నిన్నామొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటంతో … ఆ లైన్ లో…అల్లుడికి నియోజకర్గ ఇన్చార్జ్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ అధినేతపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే చంద్రబాబు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కనీసం సుబ్రహ్మణ్యం నాయుడుకి కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది.ఎందుకంటే.జగదీష్… 2014 తర్వాత నగరి నియోజవర్గంలో లేరు.

గాలి ముద్దు కృష్ణమనాయుడు ఓటమి తర్వాత ఆయన వ్యాపారాల్లో మునిగిపోయారు.కానీ భాను ప్రకాష్ తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం పనిచేశారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి 

రోజా ఎమ్మెల్యేగా ఉంటె సమస్యలని పరిష్కరించాలి అంటూ కొంతమంది.సాయం చేయాలి అంటూ కొంతమంది ఇలా అనేక రకాలుగా నగరి ప్రజలు భాను దగ్గరకి వచ్చే వారు.

Advertisement

ఒకరకంగా చెప్పాలంటే నగరిలో రోజా హైప్ తగ్గి వైసీపిలో టిక్కెట్టు కూడా రాని పరిస్థితికి వచ్చిందంటే దానికి కారణం భాను అనే చెప్పాలి.అంతేకాదు రోజాకి సరైన ప్రత్యర్ధి భాను నే అనే విషయానికి చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

త్వరలోనే భాను ని నగరి ఇన్చార్జ్ గా కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.

తాజా వార్తలు