ఢిల్లీ కోటలు దద్దరిల్లేలా “చంద్రబాబు మాస్టర్ ప్లాన్”

రాజకీయాలలో అపారమైన అనుభవం.రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయస్థాయిలో చక్రం తిప్పగలిగే నేత చంద్రబాబు నాయుడు.

 Chandrbabu Hunger Strike For Ap Special Status-TeluguStop.com

అయితే గత కొంతకాలంగా కేంద్రంతో జరుగుతున్న సంప్రదింపులు సయోధ్యలు ఫలించక కేంద్రం నుంచీ బయటకి వచ్చేశారు.ఎపీకి జరుగుతున్న అన్యాయంపై గళం విప్పిన చంద్రబాబు ని కేంద్రం ఎన్నో ఇబ్బందులకి గురిచేసిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ ,జగన్ ,బిజెపి తోడు దొంగలుగా మారి చంద్రబాబు ని ఇబ్బందులకి గురిచేస్తూ ఎన్నో కుట్రా రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు ని ఏపీ ప్రజల ముందు దోషిని చేయాలని భావిస్తున్నారు.,ఇప్పటికే చంద్రబాబు వలన రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనే విషయాని ప్రజలకి తెలియచేయడంలో వారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.అయితే

ఎత్తులకి పై ఎత్తులు వేయడంలో చంద్రబాబు ని మించిన వారు లేరనే విషయం మరో మారు తెలియచేస్తున్నారు చంద్రబాబు.అందుకు తగ్గట్టుగానే త్వరలో ఢిల్లీ ఫీటం కదిలేలా ఢిల్లీ వీధిలో ధర్నాకి దిగానున్నారని టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు.ఈ దీక్ష జాతీయ స్థాయిలో సైతం తీవ్రమైన ప్రభావాన్ని చూపించే విధంగా ఉండేలా పక్కా ప్లాన్ చేసుకున్నారట చంద్రబాబు.

అయితే ఈ దీక్షలో ప్రత్యేకత ఏమిటంటే.ఇనతకు మునుపెన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర సీఎం తన రాష్ట్ర ప్రజల కోసం ఢిల్లీ వెళ్లి మరీ దీక్ష చేయడం అనేది ఇదే మొదటి సారి అవుతుంది.

జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం అవుతుంది అంతేకాదు ఏపీ ప్రజలలో చంద్రబాబు పై విపరీతమైన నమ్మకం అభిమానం ఏర్పుడుతుంది.

అందుకే ఈ చంద్రబాబునాయుడు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

విభజన చట్టం అమలు చేయాలని… ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఢిల్లీ వేదికగా మూడు రోజుల పాటు దీక్ష చేయడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది.ఈ దీక్ష ఏప్రిల్ నెలా ఆఖరు వారంలో ఉంటుందని అంటున్నారు.

ఇదే గనుకా జరిగితే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి … ఢిల్లీ నడిబొడ్డున ధర్నా చేయడం… తమకు అన్యాయం జరుగుతోందని… నినదించడం జరిగితే.భారత దేశ చరిత్రలో ఇలాంటి సంఘటన మొదటి అవుతుంది.

కేంద్రం ఎంతటి నియంత పాలన సాగిస్తోంది అని చెప్పడానికి చంద్రబాబు లాంటి నేత దీక్ష నిదర్సనం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube