వైభవంగా అమ్మవారి సారే..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి గోదా రంగనాథుల స్వామివారి కళ్యాణం ఈనెల 12న స్థానిక దేవాలయంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మధ్య నిర్వహిస్తున్న సందర్భంగా గురువారం అమ్మవారికి ఘనంగా సారే సమర్పించుకున్నారు.

మహిళా భక్తులు తీసుకువచ్చిన అలంకరణ వస్త్రాలు అమ్మవారికి సమర్పించుకున్నారు.

అనంతరం పురవీధుల గుండా మహిళా భక్తులు కలిసి భజన కీర్తనలతో, భక్తి పాటలతో ఊరేగింపును నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బిట్కూరి నవీన్ స్వామి,ఆలయ కమిటీ అధ్యక్షులు గడ్డం జితేందర్, ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మాజీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు మేగి నరసయ్య, హరికృష్ణ భక్తుడు ఈశ్వర్, గన్న పద్మారెడ్డి, పోతు ఆంజనేయులు, ముత్యం రెడ్డి, రామ్ రెడ్డి, సిరి గాద రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Latest Rajanna Sircilla News