పవన్ కళ్యాణ్ పై నాగబాబు కవిత..!!

ఏపీలో రేపే పోలింగ్.శనివారం ఎన్నికల ప్రచారం ముగిసింది.

ఈసారి ఏపీలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

ఏపీలో అనేక పార్టీలు పోటీ చేస్తున్న ప్రధాన పోటీ వైసీపీ.

కూటమి పార్టీల మధ్య నెలకొంది.ఇదిలా ఉంటే జనసేన పార్టీ( Janasena Party ) అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈసారి పిఠాపురం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలామంది నటీనటులు పిఠాపురంలో( Pithapuram ) ప్రచారం చేశారు.2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.దీంతో ఈసారి పిఠాపురం నుండి ఎలాగైనా గెలవాలని డిసైడ్ అయ్యారు.

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నాగబాబు( Nagababu ) సైతం భారీ ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అయితే సరిగ్గా పోలింగ్ కి ఇంకా కొన్ని గంటలు ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ పై నాగబాబు కవితాత్మక ట్వీట్ చేయడం జరిగింది."నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడ ఎందుకు నిలబడతావ్ అని అడిగితే చెట్టుని చూపిస్తాడు అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని.నీతో నడవని వాళ్ల కోసం కూడ ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే వర్షాన్ని చూపిస్తాడు.

Advertisement

తనకి మొక్కని రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని., అప్పట్నుంచి అడగటం మానేసి.ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను.

సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది.సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.

విజయీభవ.!" అని ట్వీట్ చేయడం జరిగింది.

ఈ ఏడాది చివరికి ప్రభాస్ పెళ్లి... సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు లక్ష్మి?
Advertisement

తాజా వార్తలు