పవన్ పై తీవ్ర అసంత్రుప్తిలో నాగబాబు...???

ఏపీలో ఎన్నికల సమరానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది.

అన్ని ప్రధాన పార్టీల అధినేతలు చివరి రోజు సైతం ప్రజలని తమవైపుకి తిప్పుకునేలా చేయని వ్యాఖ్యలు లేవు, ఇవ్వని వాగ్దానాలు లేవు.

అయితే అధినేతలు తమ తమ అభ్యర్ధులని పరిచయం చేస్తూ బహిరంగ వేదికలపై స్పీచ్ లు ఇస్తున్నప్పుడు ఆయా నియోజక వర్గాల అభ్యర్ధులు ఎంతో ఉశ్చాహంగా కనిపిస్తారు, రెండు చేతులూ జోడించి ప్రజలకి అభివాదం చేస్తూ మీ ఓటు నాకు వేయండి అంటూ అడుగుతారు.చిరునవ్వు చిందిస్తూ ప్రజల ముందు కనిపిస్తారు.

ఓటమి ఉంటుందని తెలిసినా సరే ప్రజా క్షేత్రంలో ఓ అభ్యర్ధి పాటించాల్సిన నియమాలు ఇవి.కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు, నరసాపురం పార్లమెంటు అభ్యర్ధిగా బరిలో నిలబడిన సమయంలో ఎంతో ఉశ్చాహంగా కనిపించారు, ఎంతో స్పీడుగా ప్రజల్లోకి దూసుకుపోతూ ప్రచారం నిర్వహించారు.అయితే ఆ తరువాత ఏమయ్యిందో ఏమో కానీ నాగబాబు స్పీడుకి బ్రేకులు పడ్డాయనే టాక్ వినిపించింది.

ఒక్క సారిగా నాగబాబు తీవ్ర నిరాశ నిస్పృహలకి లోనయ్యారని టాక్ వినిపించింది.ఎప్పుడు చురుకుగా ఉంటూ, చుట్టుపక్కల వారిని ఆటపట్టించే నాగబాబు ఒక్కసారిగా సైలెంట్ అవడం అందరిలో ఎన్నో అనుమానాలు రేకెత్తించింది.

Advertisement

ఇవన్నీ గాలి వార్తలని ముందు కొట్టి పడేశారు మొదట్లో కానీ పవన్ భీమవరం, పాలకొల్లు, నరసాపురం బహిరంగ సభలని ఒక్క సారి పరిశీలిస్తే నాగబాబు ఆ సభలో వ్యక్త పరిచిన హావభావాలు చూస్తే ఇది నిజమే అని ఒప్పుకోక మానరు.పాలకొల్లు నడిబొడ్డున జరిగిన పవన్ సభలో నాగబాబు ఎంతో నిరాశ, నిస్పృహతో కలిపించారు, ఓటమి చెందిన వ్యక్తి ఎంతటి భాధలో ఉంటారో అలాంటి భావాలు ఆయన ముఖాన వ్యక్తపరిచినట్లుగా కనిపించింది.

దాంతో నాగబాబు విషయంలో ఎన్నో ఎన్నెన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కొంతమంది నాగబాబు కి ప్రజల నుంచీ సరైన స్పందన రాలేదని, నరసాపురం లో జనసేన క్యాడర్ తనని పట్టించుకోని కారణంగానే ఆయన అసంతృప్తిగా ఉన్నారని, ఇలా ఉంటె తన ఓటమి ఖాయమని ఆయన ఆందోళన చెందారని అంటున్నారట.మరికొందరు.

బాబు, పవన్ ల మధ్య ఉన్న ఒప్పందం నాగబాబు కి తెలిసి ఉంటుందని, నాగబాబుని పవన్ కళ్యాణ్ కావాలనే అక్కడ డమ్మీ అభ్యర్ధిగా నిలబెట్టారని ఆ విషయం తెలియడంతో పవన్ పై నాగబాబు గుర్రుగా ఉన్నారని అందుకే కొంతకాలంగా నాగబాబు పవన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.అయితే ఈ ఊహాగానాలు ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ మొత్తానికి నాగబాబు ఎపీసోడ్ ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది.

మూసీ యుద్ధం..  రేవంత్ వర్సెస్ ఈటెల 
Advertisement

తాజా వార్తలు