పవన్ ని ప్రశ్నించొద్దంటున్న నాగబాబు

తెలుగు దేశం పార్టీకి మేలు చేయడానికి రాజకీయం చేస్తున్నారు తప్ప అధికారం కోసం కాదని ఇది కాపులను వంచించే ప్రయత్నమే నని ,అధికార వైసిపి పదేపదే విమర్శలు చేస్తున్నందున జనసేన పార్టీ ( Janasena Party ) రూట్ మార్చినట్లుగా తెలుస్తుంది తామా అధికారం కోసమే పని చేస్తున్నామని అధికారంలోకి వస్తే తాము చేయబోయే కార్యక్రమాలను ప్రచారం చేయడం ద్వారా అధికారం వైపే తాము గురి పెట్టామని సంకేతాలను ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుందిజనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నాగబాబు( Nagababu ) పార్టీకి ఆదరణ ఉంటుందని భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర పై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు అక్కడ పార్టీ ఆఫీసులు తెరచి పార్టీ కమిటీలను పర్యవేక్షిస్తున్నారు.

తెలుగుదేశం పొత్తులో మెజారిటీ స్థానాలను ఇక్కడి నుంచే తీసుకోవాలని తద్వారా గెలుపు సులువుతుందని జనసేన లెక్కలు కడుతుంది.

ఇందులో భాగంగానే అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.అక్కడ ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది .

Nagababu Comments On Pawan Kalyan Details, Nagababu, Pawan Kalyan , Janasena Par

రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని( CM Jagan ) ఇంటికి సాగనంపడే ఏకైక మార్గం అని చెప్పుకొచ్చారు జనసేనకు గత ఎన్నికలలో ఏడు శాతం ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 35 శాతం పెరిగినట్లుగా తమకు రిపోర్టులు ఉన్నాయని జనసేన తెలుగుదేశం పొత్తుపై ఎక్కువగా వ్యాఖ్యలు చేయకండి అని పవన్ కళ్యాణ్ పై( Pawan Kalyan ) నమ్మకం ఉంచండి అని మీ గౌరవానికి కష్టానికి వ్యతిరేకంగా ఆయన ఏమీ చేయడని జనసైనికల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు .మహిళా కార్యకర్తలు పార్టీకి ఆక్సిజన్ లాంటివారని మరింత మందిని పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేయాలంటూ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు

Nagababu Comments On Pawan Kalyan Details, Nagababu, Pawan Kalyan , Janasena Par

అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు స్వాహా చేయటం తెలిసిన ఈ మంత్రులకు అభివృద్ధి చేయడానికి మాత్రం నిధులు దొరకడం లేదని కారణాలు చూపుతున్నారని పవన్ కళ్యాణ్ కు అధికారం వస్తే అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తామని అన్ని రకాల పంటలకు మద్దతు ధర అందించే ప్రయత్నం చేస్తామంటూ ఆయన చెప్పుకొచ్చేరు .గత కొంత కాలం వరకు కేవలం అభ్యర్థులు గెలుపు వరకు మాత్రమే మాట్లాడిన జనసేన పార్టీ ఇప్పుడు అధికారం వస్తే ఏం చేస్తాము కూడా ప్రజలకు వివరించడం ఆసక్తికరంగా మారింది .తద్వారా ప్రజలకు కార్యకర్తలకు కూడా తాము ముఖ్యమంత్రి రేసులో ఉన్నామన్న సంకేతాలు ఇవ్వడానికి జనసేన ప్రయత్నిస్తుంది అని తెలుస్తుంది.

Advertisement
Nagababu Comments On Pawan Kalyan Details, Nagababu, Pawan Kalyan , Janasena Par
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

తాజా వార్తలు