పోరాడి గెలిచాం అంటూ నాగబాబు కీలక వ్యాఖ్యలు..!!

జనసేన కీలకనేత నాగబాబు( Nagendra Babu ) సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.ఎన్నికలలో పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన పార్టీ గెలవడం తెలిసిందే.

జనసేన పార్టీ గెలుపు కోసం నాగబాబు ఎంతో కృషి చేశారు.ఆఖరికి పోటీ చేయాల్సిన పరిస్థితి నుండి కూడా సీటును త్యాగం చేశారు.

జనసేన పార్టీ కార్యకర్తలను మరియు అభిమానులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు.ఎక్కడ కూడా గ్రూపు తగాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు.

పొత్తు పెట్టుకున్న మిగతా పార్టీలతో జనసేన కేడర్ కలిసి పనిచేసేలా దగ్గరుండి అనేక పనులు పర్యవేక్షించారు.పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

Advertisement

పోలింగ్ మూడు నెలలు ముందు నుంచి విస్తృతంగా పర్యటిస్తూ.జనసేన పార్టీ( Janasena party )ని బలోపేతం చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ క్రమంలో భారీ విజయాన్ని అందుకోవటంతో నాగబాబు సోషల్ మీడియాలో మీసం తిప్పుతూ సంచలన పోస్ట్ పెట్టారు.

"ఈ మీసం తిప్పింది జనసేనాని 100% Strike Rate కొట్టాడని కాదు, కూటమి అఖండ విజయం సాధించింది అని కాదు ఈ ధర్మపోరాటం లో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరపున నేను గర్వంతో తిప్పుతున్నాను ఈ మీసం.!" అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది.

నాగబాబు పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఆరు దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ ఎంట్రీ .. యూఏఈ కీలక నిర్ణయం
Advertisement

తాజా వార్తలు