ఏపీలో పోలింగ్( AP polling ) అనంతరం వైసీపీ.టీడీపీ నాయకులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దుమణిగింది.కానీ జూన్ 4న ఫలితాలు వచ్చినా అనంతరం తెలుగుదేశం పార్టీ గెలిచాక మరింతగా ఇప్పుడు రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
గెలిచిన నేతలు తమ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు.చాలా చోట్ల వైసీపీ పార్టీ కార్యకర్తల పై నాయకులపై దాడులు జరుగుతున్నాయి.
ఈ విషయంలో వైసీపీ పార్టీ అలర్ట్ అయ్యి.గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu) రాష్ట్రంలో జరుగుతున్న గొడవలపై స్పందించారు.
వైసీపీ కవ్వింపు చర్యలకు టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని సూచించారు.కొన్నిచోట్ల వైసీపీ.టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు.
ఈ క్రమంలో దాడులు ప్రతిదాడులు జరగకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను ఆదేశించారు.పోలీసులు సైతం శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
ఇదిలా ఉంటే జూన్ 12వ తారీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.అమరావతిలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిగేలా తెలుగుదేశం నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.