వైరల్ వీడియో: యాక్సిడెంట్ జరిగే ముందు ఏం జరుగుతుందో.. భలేగా చూపెట్టారుగా..

ఈ మధ్యకాలంలో అనేక రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా( Social media)లో ఎక్కువగా కనబడుతున్నాయి.యక్షిడెంట్ విడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో అవి కాస్త ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

 Viral Video: What Happens Before An Accident , Social Media, Viral Video, Road-TeluguStop.com

ఇలా రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం వాహనదారులు చేసే నిర్లక్ష్యం వల్లనే సంభవిస్తుంటాయి.ఎక్కువగా డ్రైవ్ చేసేవారు మద్యం సేవించడం వల్ల, అలాగే కొన్ని సమయాలలో నిద్రమత్తు వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వాహనదారులకు అవగాహన కల్పించాలని ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోలో రెండు వాహనాలు ఢీకొనే సమయంలో ఏం జరుగుతుందన్న కాన్సెప్ట్ తో త్రీడి గ్రాఫిక్స్ ( 3D graphics)ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ నిజంగా ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియోలో ఓ బైకర్ రోడ్డుపై చాలా స్పీడ్ గా వెళుతూ ఉంటాడు.అలా వెళ్తున్న సమయంలో మరో బైక్ అతడి కంటే వేగంగా వెళ్తుంటాడు.దీంతో అతనిని ఓవర్ టేక్ చేయాలనే ఉద్దేశంతో అతను కూడా వాహనాన్ని మరింత వేగంగా నడపడానికి ప్రయత్నిస్తాడు.

ఈ సమయంలో ఓ మినీ వ్యాన్ ఓవర్టేక్ చేయబోతుండగా షాకింగ్ సంఘటన చోటు చేసుకుంటుంది.ఓవర్టేక్ చేసే సమయంలో ఓ లారీ బైకుకు ఎదురుగా వస్తుంది.కరెక్ట్ గా అదే సమయంలో బైకు లారీ ఢీకొన్న సమయంలో ఒక్కసారిగా వీడియో ఫ్రీజ్ అవుతుంది.అలాంటి సమయంలో ఒక్కసారిగా రోడ్డు పక్కన చూడగా సినిమాలో చూపించిన విధంగా దయ్యం లాంటి ఆకారం నిలబడి ఉంటుంది.

ఈ వీడియో చూడడానికి నిజంగా పరిస్థితులు ఇలాగే ఉంటాయేమో అన్నట్లుగా వీడియోని చిత్రీకరించడం జరిగింది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఓసారి వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube