పెద్ద పెద్ద హీరోల వల్ల సాధ్యం కానీవి చిన్న హీరోలు చేసి చూపించారు !

చాలాసార్లు గొప్ప సినిమా తీస్తున్నాము కాబట్టి కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి, పెద్ద హీరోలతో అదిరిపోయే సినిమా తీస్తున్నాము అనే భ్రమలో ఉంటారు దర్శకులు మరియు నిర్మాతలు.కానీ కోట్ల కొద్ది బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకు రాని అవార్డులు రివార్డులు చాలా సార్లు చిన్న సినిమాలకే వస్తాయి.

 Small Movies Turns Big While Big Ones Are Doing Nothing , Malayalam , Small Mo-TeluguStop.com

అలాగే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా తీసుకురానీ కలెక్షన్స్ చిన్న హీరోలే తీసుకొస్తారు.ఏ సినిమాకి ఎప్పుడు ఎలా రిజల్ట్ వస్తుందో ఏ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తాడో చెప్పడం చాలా కష్టం.

సినిమాలో దమ్ము ఉండాలి కానీ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత పెద్ద బ్యానర్ అయినా ఎంత పెద్ద దర్శకుడు అయినా కూడా సాధించలేని ఎన్నో విషయాలను చిన్న సినిమాలే నిరూపిస్తాయి.మరి ఆ చిన్న సినిమాలు సాధించిన అద్భుతాలు ఏంటి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Balagam, Hanuman, Malayalam, Manjummel, Small, Teja Sajja, Venu-Movie

మలయాళం( Malayalam) లో ఎన్నో ఏళ్లుగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు మోహన్ లాల్ మమ్ముట్టి వంటి వారు.వారు కూడా కొల్లగొట్టలేని కలెక్షన్స్ అతి చిన్న సినిమా అయినా మంజుమల్ బాయ్స్( Manjummel Boys ) సాధించి చూపించింది.పైగా ఇందులో ఒక్క నటుడు కూడా జనాలకు తెలిసిన వారు లేకపోవడం విశేషం. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూల్లను సాధించి పాన్ ఇండియా సినిమాగా అవతరించింది.

Telugu Balagam, Hanuman, Malayalam, Manjummel, Small, Teja Sajja, Venu-Movie

ఇక బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలు కూడా సాధించలేని వసూళ్లను ప్రాఫిట్స్ ని సాధించిన సినిమాగా చిన్న సినిమా అయినా హనుమాన్ చిత్రాన్ని చెప్పుకోవచ్చు.పెట్టిన కలెక్షన్స్ తో పోలిస్తే వచ్చిన వసూళ్ల ను అంచనా వేసే ప్రాఫిట్స్ నిర్ధారిస్తారు.అలా చూసుకుంటే తేజ సజ్జ నటించిన హనుమాన్( Hanuman movie ) చిత్రానికి చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు.అందువల్లే దీనికి ప్రాఫిట్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంది.

ఒక మంచి సినిమా తీస్తే కచ్చితంగా అవార్డ్స్ లభిస్తాయి అయితే చాలామంది దర్శకులు మన చరిత్రలో ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించి చాలా పెద్ద మొత్తంలో అవార్డులను అందుకున్న వారు ఉన్నారు.కానీ ఒక కమీడియన్ ఆయన వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాకి మాత్రం ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రానని అవార్డ్స్ రావడం విశేషం.

ఈ చిత్రానికి 100 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube