సినిమా ఇండస్ట్రీలో ఒకే తరహా పాత్రల్లో నటించాలంటే చాలామందికి చిరాకు అనే సంగతి తెలిసిందే.కొంతమంది తమను తాము ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించినా కొత్త తరహా పాత్రలు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
బాలీవుడ్ నటి సునీత్ రాజ్ వార్( Sunita Rajwar ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చదువైపోయిన వెంటనే నాకు మూవీ ఆఫర్లు వచ్చాయని ఆమె అన్నారు.

అయితే నాకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలను ఆఫర్ చేసేవారని సునీత పేర్కొన్నారు.ఆ పాత్రలు చేసీచేసీ బోర్ కొట్టడంతో యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నానని ఆమె తెలిపారు.అలా బ్రేక్ తీసుకోవడం వల్ల నాకు మంచే జరిగిందని సునీత వెల్లడించారు.ప్రస్తుతం నాకు భిన్నమైన రోల్స్ వస్తున్నాయని అమె పేర్కొన్నారు.విభిన్నమైన రోల్స్ లో నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని సునీత అన్నారు.

నచ్చిన రోల్స్ చేస్తూ నేను జనాలను నవ్వించగలుగుతున్నానని సునీత రాజ్ వార్ వెల్లడించడం గమనార్హం.చిన్నదానికి కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఈరోజుల్లో జనాల ప్రేమను పొందడం కష్టం అని సునీత రాజ్ వార్ అన్నారు.సినిమా ఇండస్ట్రీలో నన్ను చూసే పద్ధతి మారిందని ఆమె అన్నారు.
ప్రస్తుతం నా కెరీర్ విషయంలో సంతోషంగా ఉన్నానని సునీత తెలిపారు.నాకు ఏదో సాధించేసినంత సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ఇంతకు మించి ఏం కావాలని సునీత రాజ్ వార్ అన్నారు.సునీత రాజ్ వార్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
పంచాయత్ 2( Panchayat Season 2 ), పంచాయత్ 3, గుల్లక్ అనే వెబ్ సిరీస్ లతో పాపులారిటీని సంపాదించుకున్నారు నటి సునీత రాజ్ వార్ టాలెంట్ కు నెటిజన్లు ఎంతో ఫిదా అవుతుండటం గమనార్హం.