ప్రాజెక్ట్ k సినిమా ఓ కల్తీ సినిమా.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్!

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధే శ్యామ్.ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా తాజాగా హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో రాధే శ్యామ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాట్లతో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.నాగ్ అశ్విన్ వేదికపైకి రాగానే నవీన్ పొలిశెట్టి అతన్ని ఆట పట్టించాడు.

Advertisement

రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ ఎంతో నచ్చిందని, ఇంత మంది డైరెక్టర్లు వచ్చి పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం రాజమౌళి, ప్రభాస్ అని తెలిపారు నాగ్ అశ్విన్.వారు నిర్మించిన ప్లాట్ ఫామ్ పై ఇప్పుడు మేమంతా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఈ ఈవెంట్ లో భాగం కావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే నమ్మకంతో ఉన్నానని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

అనంతరం ప్రాజెక్ట్ k సినిమా గురించి చెప్పండి అని అడుగుతుండటంతో.ఆ విషయం గురించి చర్చిస్తూ.నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ప్రాజెక్ట్ k సినిమా వైపు తీసుకెళ్లారు నవీన్ పొలిశెట్టి.

అనంతరం ఆ సినిమా గురించి చెబుతూ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే తెలుగులో మాట్లాడారని, అలాగే హీరో ప్రభాస్ హిందీలో మాట్లాడారని అన్నారు.ఇంకా చెప్పాలి అంటే ఒక కల్తీ సినిమా తీస్తున్నామని సరదాగా కామెంట్ చేశారు నాగ్ అశ్విన్ .మళ్లీ సంవత్సరం తర్వాత ప్రాజెక్టు k సినిమా కోసం ఇలాంటి ఈవెంట్ లో కలుసుకుందాం అని చెబుతూ రాధే శ్యామ్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు