మంత్రి కేటీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న మేము కోవర్టులమా అని ప్రశ్నించారు.

కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు.మీ అవినీతి చిట్టా మొత్తం తెలుసని చెప్పారు.

తన జోలికి వస్తే చిట్టా విప్పుతా అంటూ హెచ్చరించారు.తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని వదిలేసా అన్న కోమటిరెడ్డి .ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమిషన్ల కుటుంబమని ఆరోపించారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ పై వారు కోమటిరెడ్డిలు కాదు.కోవర్టు రెడ్డిలంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెంకట్ రెడ్డి స్పందించారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు