తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.నియామక ఉత్తర్వులు ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేదని విద్యుత్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదేశాలు ఉల్లంఘించడంతో తెలంగాణ ప్రభుత్వం పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు జైలు శిక్ష పరిష్కారమని వ్యాఖ్యానించింది.
ఏపీ నుంచి వచ్చిన సిబ్బందికి నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.అనంతరం తదుపరి విచారణ ఈనెల 31కి వాయిదా వేసింది.