కామంతో కళ్ళు మూసుకుపోయిన...కసాయి తల్లి

యువతీ యువకులకి ఈ మధ్య కామంతో కన్ను మిన్ను కనపడటం లేదు.

పెళ్లయినా సరే పరాయి వ్యక్తుల పై కలుగుతున్న కోరికల కారణంగా తమ రక్త సంభందాలని సైతం గాలికి వదిలేస్తున్నారు చివరకు పేగు తెంచుకు వచ్చిన బిడ్డలని సైతం చంపేసే తీవ్రమైన దారుణాలకి పాల్పడుతున్నారు.

రాను రాను సమాజంలో విలువలనేవి లేకుండా పోయే పరిస్థితికి సమాజాన్ని తీసుకుపోతున్నారు.వివరాలలోకి వెళ్తే.

Mother Murdered Daughter Due To Illegal Relation

పెళ్ళయిన ఓ యువతి ప్రియుడి మోజులో పడి కన్న కూతురినే కడతేర్చింది.వివరాలలోకి వెళ్తే ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని నాగవార గ్రామంలో.కోలారు నగరంలోని కనకనపాళ్యకు చెందిన సుబ్బు లోకేష్‌ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం తన భార్య నిఖిత, కూతురు కుముద కనిపించడం లేదని, అనిల్‌ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ కోలారు నగర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

అయితే ఆ అనిల్ అనే యువకుడితో నిఖితకి అక్రమ సంభంధం ఏర్పడింది.ఈక్రమంలో నిఖిత తన కుమార్తె తో సహా ఆమె ప్రియుడు అనిల్ తో ఇలు వదిలి వెళ్ళిపోయింది.

Advertisement
Mother Murdered Daughter Due To Illegal Relation-కామంతో కళ్�

తల్లీ, కూతురు అదృశ్యంపై పోలీసులు కేసు విచారణ చేపట్టి అనిల్, నిఖితలు బెంగుళూరులోని హలసూరులో నివాసం ఉంటున్నట్లు తెలుసుకుని బెంగుళూరుకు వెళ్లి వారిని తీసుకు వచ్చారు.విచారణలో తాము కుముదను హత్య చేశామని, కోలారులో హత్య చేసి శవాన్ని ఆంధ్ర సరిహద్దు సమీపంలోని ముళబాగిలు తాలూకా నాగవార గ్రామం వద్ద ఉన్న పాడుబావిలో పారవేసినట్లు ఒప్పుకున్నారు.

ఇంతటి ఘోరం చేసిన ఆ కసాయి తల్లిని అనిల్ పై హత్యా నేరంపై కేసుని నమోదు చేసుకుని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు