బెర్ముడా ట్రయాంగిల్ కన్నా ప్రమాదకరమైన ఏరియా.. ఎక్కడో తెలుసా..?!

ఈ భూమిపై మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.

వాటిని చెదిద్దామని ఎంతోమంది ప్రయత్నించినా గాని ఆ రహస్యం ఏంటి అనేది ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు.

అలాంటి రహస్య ప్రదేశాలలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో బెర్ముడా ట్రయాంగిల్, ఏరియా -51 అని పిలిచే ప్రదేశాల గురించి మాత్రమే మనకు తెలుసు.కానీ ఈ రెండు ప్రదేశాల కంటే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం మరొకటి కలదు.

ఆ ప్రదేశం అత్యంత ప్రమాదకరం అని అనడానికి గల కారణం ఏంటంటే ఆ ప్రదేశం వైపు వెళ్లిన విమానాలు ఇప్పటి వరకు తిరిగి రాకపోవడం వలన ఆ ప్రదేశాన్ని అత్యంత ప్రమాదకర ప్రదేశంగా శాస్త్రవేత్తలు గుర్తించారు.ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే పశ్చిమ అమెరికాలోని రెనో, ఫ్రెస్నో, లాస్ వెగాస్ మధ్య గల నెవాడా ట్రయాంగిల్‌ అంట.ఈ ప్రదేశం దగ్గరకు ఎటువంటి విమానం వెళ్లినాగాని ఇప్పటి వరకు తిరిగి రాలేదంటే నమ్మండి.ఇంకా ఈ ప్రదేశం గురించి లోతుగా తెలుసుకుంటే మీరు షాక్ అవటం గ్యారంటీ.

ఒక పరిశోధనలో తేలింది ఏంటంటే గత 60 సంవత్సరాలలో సుమారు 2 వేలకు పైగానే విమానాలు ఈ ప్రదేశంలో కూలిపోయాయట.విమానాన్ని నడిపే పైలట్లు కూడా ఏమయిపోయారో తెలియదు.

Advertisement

ఈ ప్రాంతంలో ఏదో ఒక శక్తి దాగి ఉందని ఇప్పటికే చాలా మంది నమ్ముతారు.ఏదో కంటికి కనపడని అదృశ్యశక్తి ఇలా అటు వైపు వచ్చే విమానాలను క్రాష్ చేస్తుందని అంటూ ఉంటారు.

అంతేకాకుండా ఈ ప్రదేశంలో గ్రహాంతరవాసులు తిరుగుతూ ఉంటారని చాలా నివేదికలు ఉన్నాయట.ఈ ప్రాంతంలో ఏదో తెలియని శక్తి వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

నెవాడా ట్రయాంగిల్ అనే ప్రాంతం ఇంగ్లాండ్‌ లో సగానికి పైగా ఆక్రమించి ఉంది.

అలాగే ఇక్కడి ప్రాంతాల్లోనే ఎక్కువ సంఖ్యలో విమాన ప్రమాదాలు సంభవించాయి.ఈ ప్రాంతంలో గాలి పీడనం అధికంగా ఉండడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని సైన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.అలాగే విమానాలు ఈ ప్రాంతం దగ్గరకు వచ్చాక ఎతైన పర్వతాల మీదుగా ఎగురాలిసి వస్తుంది.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
ఇదేందయ్యా ఇది.. కడుతుండగానే మూడోసారి కూలిపోయిన వంతెన..

ఈ క్రమంలో ఉన్నటుండి ఎడారి లాంటి భూమి వైపు విమానం ప్రయాణం చేసినప్పుడు అక్కడ గాలి పీడనం వలన విమానాలు కుప్పకూలు కింద పడిపోతున్నాయి శాస్త్రవేత్తలు అంటున్నారు.అయితే ఈ అధిక గాలి ఒత్తిడి కారణంగానే విమానాలు కుప్పకూలి పడిపోతున్నాయనే విషయాన్నీ ఇప్పటిదాకా ఏ శాస్త్రవేత్తలు కూడా శాస్త్రీయంగా నిరూపించలేకపోయారు.

Advertisement

ఇప్పటికి ఈ స్టోరీ ఒక మిస్టరీలాగానే మిగిలిపోయింది.

తాజా వార్తలు