మోక్షాజ్ఞ ఎంట్రీ ఎప్పుడో?

నందమూరి బాలక్రిష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ బయోపిక్ తో ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే ఊహించని విధంగా డ్రాప్ అయ్యాడు.

ఓ విధంగా డ్రాప్ అయ్యిందే మంచిదైంది.లేకుంటే కెరీర్ ఆదిలోనే ప్రశ్నార్థకంగా మారేది.

అందుకే బాలక్రిష్ణ కొడుకు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మొన్నటివరకు విదేశాల్లో మోక్షజ్ఞ నటనలో శిక్షన తీసుకున్నట్లు టాక్ వచ్చింది.ఇక అప్పుడప్పుడు మనోడి ఫొటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.రీసెంట్ గా బయటకొచ్చిన మరో ఫొటో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Advertisement

సింపుల్ లుక్స్ తో న్యాచురల్ గా కనిపిస్తున్నాడు.అయితే ఇంత సింపుల్ గా ఉన్న ఒక స్టార్ హీరో వారసుడు ఎలాంటి ఎంట్రీ ఇస్తాడా అనేది అందరిలో ఒక చర్చ మొదలైంది.

గతంలో కొన్ని స్క్రిప్ట్ లపై చర్చలు జరిపిన బాలయ్య రెండు కథలను పక్కన పెట్టినట్లు సమాచారం.సీనియర్ రచయితలతో దర్శకులతో మీటింగ్ పెట్టి మోక్షజ్ఞ కెరీర్ కోసం సలహాలు తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

మరి ఈ స్టార్ తనయుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు