మురళి మోహన్ కాలర్ పట్టుకున్న మోహన్ బాబు.. చివరికి అలా అనేసరికి!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంతటి ముక్కోపి అనే విషయం టాలీవుడ్ లో అందరికీ తెలుసు సినిమాల విషయంలో కాస్త అటు ఇటు అయితే ఆయన ఊరుకోడు షూటింగ్ కి ఎవరైనా లేటుగా వచ్చినా కూడా ఆ రోజు వారి పని అయిపోయినట్టే ఆయన పేరు చెప్తే చాలామంది అక్కడి నుంచి పారిపోతారు.

తానే గొప్ప అనే విధంగా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు.

ఇక అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లో లేదా ఏదైనా సినిమా ఫంక్షన్స్ లో తన సహనటులపై చేసే కామెంట్స్ కూడా వివాహదాస్పదం అవుతూ ఉంటాయి.ఇక మోహన్ బాబు చేసిన ఒక పని గురించి మురళీమోహన్ స్వయంగా ఇంటర్వ్యూలో తెలపడం విశేషం.

ఒకసారి మోహన్ బాబు తన కాలర్ పట్టుకున్నాడు అంటూ బాంబు పేల్చాడు.మురళీమోహన్ మా అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగిందట.

ఆ సమయంలో సినిమా ఆర్టిస్టులతో క్రికెట్ ఆడించి సంతు కలెక్ట్ చేయాలని భావించారట.అప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కెప్టెన్సీగా ఉంటూ నాలుగు టీమ్స్ రెడీ అయ్యాయట.

Advertisement
Mohan Babu Insult To Murali Mohan Details, Mohan Babu, Murali Mohan, Mohan Babu

ఇక మోహన్ బాబు సైతం తన కొడుకు విష్ణు క్రికెట్ ఆడతాడని ఏదో ఒక టీంలో ఆడించమని అడిగారట.కానీ అప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించని విష్ణుకి క్రికెట్ టీం లో ఆడించే అవకాశం లేదని, రూల్స్ అందరికీ ఒకేలా ఉంటాయని మురళీమోహన్ మోహన్ బాబుతో ఖచ్చితంగా చెప్పారట.

Mohan Babu Insult To Murali Mohan Details, Mohan Babu, Murali Mohan, Mohan Babu

దాంతో నా మాటకి ఎదురు చెప్తావా అంటూ కోపంగా మురళి మోహన్ కాలర్ పట్టుకున్నాడట మోహన్ బాబు.మురళీ మోహన్ సైతం మోహన్ బాబు కాలర్ పట్టుకున్నారట.గొడవ పెద్దదవుతుందని అక్కడున్న వాళ్ళు ఆపరట.

ఆ సంఘటన జరిగినా మూడు రోజులకు మళ్ళీ మోహన్ బాబు వచ్చి తప్పు నాదే క్షమించమంటూ అడిగారట దాంతో ఆ గొడవ సద్దుమణిగిందట.ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా విష్ణు అనే పేరుతోనే 28 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి మోహన్ బాబు ఇండస్ట్రీకి పరిచయం చేశారు ఆ సమయంలో 28 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్ద విషయమే ఇప్పుడు 100 కోట్లతో సమానం అయినా కూడా ఆ సినిమా దారుణంగా విఫలమై చాలా నష్టాన్ని మిగిల్చింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు