జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహమ్మద్ ఫయాజ్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మొహమ్మద్ ఫయాజ్( Mohammad Faiz ) ను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు ఎస్కే సాహెబ్ నియామక పత్రాన్ని అందజేశారు.

జిల్లా అధ్యక్షులు ఎస్కే సాహెబ్ ఈరోజు జిల్లా కార్యాలయంలో టిపిసిసి ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్ చేతుల మీదుగా జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నా నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ అజ్మతుల్లా హుస్సేన్,సంగీతం శ్రీనివాస్ , సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి( kk mahender reddy ) లకు కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పార్టీకి తన వంతు సహాయ శక్తుల కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు అహ్మద్ ఖాన్( Ahmad Khan ),పర్యేస్,మహమ్మద్ యునుస్, ఎల్లారెడ్డిపేట మండల మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ రఫీ, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, రాగట్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఖాజా తదితరులు పాల్గొన్నారు.

డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించండి

Latest Rajanna Sircilla News