గురుద్వార‌లో ఫొటోషూట్ చేసిన మోడ‌ల్‌.. భ‌గ్గుమంటున్న నెటిజ‌న్లు

మ‌న దేశంలో గుడి ల‌ను ఎంత ప‌విత్రంగా భావిస్తామో అంద‌రికీ తెలిసిందే.

ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా అత్యంత ప‌విత్రంగా భావించి భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో దేవాల‌యాల‌ను కొలుస్తాము.

అయితే ఇలాంటి ప‌విత్ర‌మైన చోట కొన్ని సార్లు కొంద‌రు కావాల‌ని చేసే ప‌నులు తీవ్రంగా వివాదాస్ప‌దం అవుతుంటాయి.ఇప్పుడు పంజాబ్ లో ఉండే గురుద్వార‌లో ఓ పాకిస్తాన్ మోడ‌ల్ ఫొటోషూట్ చేసి వివాదంలో చిక్కుకుంది.

సిక్కులు అత్యంత ప‌విత్రంగా భావించే ఆల‌య ప్రాంగ‌ణంలో ఫోజులిచ్చిన ఫోటోల‌ను ఆ మోడ‌ల్ నెట్టింట షేర్ చేయ‌డంతో అవి కాస్తా త‌క్కువ స‌మ‌యంలోనే వైర‌ల్ అయిపోయాయి.కాగా ఈ ఫొటోలు చివ‌ర‌కు సిక్కు మ‌త‌స్తుల ద‌గ్గ‌ర‌కు చేరుకున్నాయి.

త‌ల‌మీద ఎలాంటి దుప‌ట్టా లేకుండానే ఆమె గురుద్వారాలో తిర‌గ‌డంతో వారంతా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఆమె త‌మ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచిందంటూ చాలామంది నెటిజ‌న్లు కూడా ఫైర్ అవుతున్నారు.

Advertisement
Model Who Did A Photoshoot In The Gurudwara Frightening Netizens, Gurudwara, Vir

కాగా ఆ మోడ‌ల్ సాలేహ మాత్రం మన్నత్ క్లాతింగ్ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేసే క్ర‌మంలోనే సౌలేహ క‌ర్తార్‌పూర్‌లో ఫోటోషూట్ చేసిన‌ట్టు తెలుస్తోంది.కానీ సిక్కుల మ‌నోభావాలు దెబ్బ తినే విధంగా ఆమె చేసిన ఫొటోషూట్ కాస్తా నెట్టింట ర‌చ్చ‌కు దారి తీసింది.

Model Who Did A Photoshoot In The Gurudwara Frightening Netizens, Gurudwara, Vir

ఇక ఆ మోడల్ మీద క‌ఠిన చర్యలు తీసుకోవాలంటూ శిరోమణి అకాళీ దల్‌ అధికార ప్రతినిధి అయిన మంజిందర్ సింగ్ సిర్సా ఏకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ప్ర‌తిపాదించారు.వెంటనే ఆ మోడ‌ల్ మీద యాక్ష‌న్ తీసుకోవాలంటూ డిమాండ్ కూడా చేశారు.ఇక ఇటు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఆమె చేసిన ప‌నిని త‌ప్పుప‌డుతున్నారు.

ఇలా వ‌రుస విమ‌ర్శ‌ల‌తో మోడ‌ల్ సౌలేహ దిగి వ‌చ్చింది.బ‌హిరంగంగా ఆమె అంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

తాను ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ తీయాల‌ని ప్ర‌య‌త్నించ‌లేద‌ని, కార్తాపూర్ కారిడార్ సంద‌ర్భ‌నలో భాగంగా ఆ ఫొటోలు తీసుకున్న‌ట్టు వివ‌రించింది.

రోడ్డుపై గొనె సంచిలోనుండి అరుపులు.. తెరిచి చూడగా షాకింగ్ సిన్!
Advertisement

తాజా వార్తలు