రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) విచారణ జరిగింది.

ఈ మేరకు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు అనుమతి కోరుతూ కవిత తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 7వ తేదీన వ్యక్తిగత హాజరుకు అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తి కావేరి భవేజ ముందు కవిత తరపు న్యాయవాదులు ప్రస్తావించారు.ఈ క్రమంలో కవిత వ్యక్తిగత హాజరుపై సీబీఐ, ఈడీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

అనంతరం పిటిషన్ పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 6 వ తేదీకి వాయిదా వేసింది.కాగా లిక్కర్ స్కాం( Liquor Scam ) కేసులో ఈ నెల 7తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుందన్న సంగతి తెలిసిందే.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు