గెటప్ శ్రీను కోసం మిస్ క్వీన్ ని తీసుకొస్తున్నారట...

తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ లో ప్రసారమయ్యే "జబర్దస్త్ షో" ద్వారా ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు.

ఇందులో ఇప్పటికే షకలక శంకర్, సుడిగాలి సుధీర్, వెండి తెరపై తమ చిత్రాలతో సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

 కాగా ఇప్పుడు తన విభిన్న గెటప్ లతో జబర్దస్త్ స్కిట్లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించే "గెటప్ శ్రీను" కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా "రాజు యాదవ్" అనే చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను కూడా మొదలు పెట్టారు.

కాగా ఈ చిత్రానికి కి తెలుగులో ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ చిత్రంలో గెటప్ శ్రీను కి జంటగా హీరోయిన్ గా 2016 వ సంవత్సరంలో మిస్ క్వీన్ ఇండియా గా గెలుపొందిన "అంకిత కరాట్" అనే మోడల్ నటిస్తోంది.దీంతో రెండో హీరోయిన్ గా కారుణ్య చౌదరిని కూడా తీసుకోబుతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Advertisement
Miss Queen Of India 2016 Winner Ankita Karat Play Main Lead Role In Getup Sreenu

అయితే అంకిత కరాట్ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలోనూ నటించలేదు.కానీ మోడలింగ్ రంగంలో మాత్రం బాగానే రాణిస్తోంది.

దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో తెలిసిన వారి ద్వారా అంకిత కరాట్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Miss Queen Of India 2016 Winner Ankita Karat Play Main Lead Role In Getup Sreenu

దీంతో గెటప్ శ్రీను సరసన మిస్ క్వీన్ ఇండియా అంకిత కరాట్నటిస్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజమెంతుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ మరియు ఆటో రాంప్రసాద్ ముగ్గురు కలిసి "త్రీ మంకీస్" అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకున్నప్పటికే వసూళ్లు మాత్రం రాబట్ట లేకపోయింది.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు