ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో ఆన్ లైన్ బుకింగ్ విధానం తీసుకు రావడం తెలిసిందే.చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలని.
సినిమా థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడు నష్టపోకూడదనే.ఉద్దేశంతో ఆన్ లైన్ బుకింగ్ విధానం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ప్రాంతాల వారీగా టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ల ధర విషయంలో సినిమా ఇండస్ట్రీలో ఎవరూ కూడా నోరు మెదపని పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ప్రకారం చూసుకుంటే సినిమా నిర్వహించలేని పరిస్థితి అని చాలామంది ఇండస్ట్రీలో లోలోపల చర్చించుకుంటున్నారు అట.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ తరపున దిల్ రాజు దానయ్య ,రాజమౌళి ,త్రివిక్రమ్ ఇంకా చాలా మంది ప్రముఖులు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఇండస్ట్రీ సమస్యలను తలసానికి తెలియజేశారు.అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరహాలో సినిమా టికెట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం.వ్యవహరించిందని,.అటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదని ఇండస్ట్రీ పెద్దలు క్లారిటీ ఇచ్చారు.
అంత మాత్రమే కాక కరోనా కారణం గా ఇండస్ట్రీలో చాలామంది రెండు సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
అనేక సమస్యలపై ఇండస్ట్రీ పెద్దలు మెమోరండం ఇచ్చారు.

సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరిస్తుంది.సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రజలంతా భయపడాల్సిన అవసరం లేదని కరోనా నిబంధనలు పాటించి కొన్ని జాగ్రత్తలతో సినిమా చూస్తే ఏం పర్లేదు అని చెప్పుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకుని కొన్ని లక్షలాది మంది కార్మికులు బతుకుతున్నారు టిక్కెట్ల రేట్లపై సమస్యలు ఉన్నాయి ఈ విషయంలో ముఖ్యమంత్రితో చర్చించి… సినిమా ఇండస్ట్రీలో సమస్య పరిష్కారంపై.
ఓ నిర్ణయం తీసుకుంటాం అని.తెలిపారు.