గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బస్తీ దవాఖానా ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి..

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణ గా మార్చాలనే పట్టుదలతో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు.

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బస్తీ దవాఖాన ప్రారంభోత్సవంతో పాటు సుమారు 75 లక్షలతో వీధి దీపాలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో అన్ని కాలనీలో వీది దీపాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఆరోఆరోగ్య తెలంగాణగ మార్చేందుకు బడ్జెట్ లో 10వేల కోట్లను పెట్టడం జరిగిందన్నారు.4వేల కోట్లతో వెయ్యి బెడ్లతో కూడిన 4 ఆసుపత్రులకు భీమిపూజ చేసుకోవడం జరిగిందన్నారు.మేడ్చల్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి వివరించారు.

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుందని తెలిపారు.ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీనివాస్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రభాకర్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు