పవన్ కళ్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్ కామెంట్స్..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం తెలిసిందే.

ఈ సమావేశంలో ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అందుకోసం ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలని తెలిపారు.

భారీ వ్యూహాలతో రానున్న రోజుల్లో జనసేన పార్టీని ముందుకు తీసుకెళుతున్నట్లు చెప్పుకొచ్చారు.ఇటువంటి తరుణంలో పవన్ వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా తనదైన శైలిలో కౌంటర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ కి డీల్ కుదిరింది.ప్యాకేజీ సెట్ అయ్యింది.

Advertisement

జనసేన కాదు అది నారా- నాదెండ్ల సేనరాజకీయమంటే సొంత కళ్యాణం కాదు.లోక కళ్యాణం.

ఇటువంటి పవన్ కళ్యాణ్ కి మంగళగిరిలో పార్టీ ఆఫీస్ ఎందుకు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంది కదా అంటూ తనదైన శైలిలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి దాడిశెట్టి రాజా కౌంటర్లు వేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు