వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ పై సీరియస్ కామెంట్స్ చేశారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల వాతావరణం రాజుకుంది.
ఈ క్రమంలో నెల్లూరులో 5వ డివిజన్ కి చెందిన తెలుగుదేశం పార్టీ క్యాడర్.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికలలో టీడీపీకి అభ్యర్థులే కరువైన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.నిజంగా టిడిపి నాయకులకు దమ్ముంటే కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థులను పెట్టుకోవాలి అని సవాల్ విసిరారు.

అభ్యర్ధులు కరువైన క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్లు నామినేషన్ వేయడం లేదు.దీంతో వీలు నామినేషన్లు వేయకుండా అడ్డుపడుతున్నారు… అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారు అని.మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.అసలు తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులే లేకుండా పోయారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో అర్థం లేని మాటలు చెబుతూ.భయపెట్టే పరిస్థితి అధికార పార్టీ చేస్తుంది అని అబద్ధాలు కూడా నెల్లూరు టిడిపి నాయకులు చెప్పే అవకాశం ఉందని.
తెలిపారు.కాగా అటువంటిది ఎవరు చేయరు, ఎవరైనా పోటీ చేయొచ్చు అంటూ మంత్రి అనిల్ పేర్కొన్నారు.