కాయతొలుచు పురుగుల నుంచి వంగ పంటను సంరక్షించే పధ్ధతులు..!

వంగ పంట( Brinjal ) రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షల ఎకరాలలో సాగు చేయబడుతుంది.సంవత్సరం పొడుగునా ఈ పంటను సాగు చేయవచ్చు.

వంగ పంటను వేసవిలో ఫిబ్రవరి నుండి మార్చి మొదటి వారం వరకు నాటుకోవచ్చు.ఎకరాకు దాదాపుగా 20 టన్నుల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

చీడపీడల విషయానికి వస్తే కాయతొలిచు పురుగులను సమర్ధంగా అరికట్టగలిగితే అధిక దిగుబడి పొందవచ్చు.ఈ పురుగులను ఎలా అరికట్టాలో తెలియక చాలామంది రైతులు తీవ్ర నష్టాన్ని పొందుతున్నారు.

కాబట్టి కాయ తొలుచు పురుగులను గుర్తించి, ఎలా అరికట్టాలో తెలుసుకుందాం.

Advertisement

వంగ పంట వేసిన 30 రోజుల తర్వాత ఈ పురుగు పంటను ఆశించే అవకాశం ఉంది.మొదట ఈ పురుగు మొవ్వును, ఆ తర్వాత కాయలను పూర్తిగా తొలిచి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఈ పురుగులు మొక్కను ఆశించిన తర్వాత మొక్కల మొవ్వులు వాడిపోయి ఎండిపోతాయి.

తర్వాత కాయలకు రంధ్రాలు చేసి లోపల ఉండే బాగానంత తినేస్తాయి.అటువంటి వంగ కాయలను పుచ్చుకాయలు అని అనడం మనం వినే ఉంటాం.

కాబట్టి ఈ కాయ తోలుచు పురుగులను సకాలంలో ఎలా అరికట్టాలో తెలుసుకుందాం.

నారును ప్రధాన పొలంలో నాటే ముందు రైనాక్సీపైర్( Rinoxypyr ) 5 మి.లీ ను లీటరు నీటిలో కలిపి అందులో ఈ నారును మూడు గంటల పాటు ఉంచిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.ప్రధాన పంట పొలంలో ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు 

ఐదు మిల్లీలీటర్ల వేప నూనెను ఒక లీటర్ నీటిలో కలిపి ఆకులు మొత్తం తడిచేలా పిచికారి చేస్తే తల్లిపురుగులు మొక్కలపై గుడ్లు పెట్టడానికి ఆస్కారం ఉండదు.ఒకవేళ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటిలో థయోడికార్బ్( Thiodicarb ) 2గ్రా.

Advertisement

కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.లేదంటే లీటర్ నీటిలో ఇమామెక్టిన్ బెంజోయోట్ 0.6 మి.లీ కలిపి పంటను పిచికారి చేసి ఈ పురుగుల నుండి పంటను సంరక్షించుకోవాలి.

తాజా వార్తలు