40 ఏళ్లు దాటిన పురుషులు వీటిని తీసుకుంటే లైఫ్ రిస్క్‌లో ప‌డ్డట్టే..జాగ్ర‌త్త‌!

వ‌య‌సు పైబ‌డే కొద్ది ఏదో ఒక అనారోగ్య స‌మ‌స్య‌ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

ముఖ్యంగా పురుషుల్లో 40 ఏళ్లు దాటాయంటే చాలు గుండె వ్యాధులు, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగ‌ర్, కంటి చూపు త‌గ్గ‌డం ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు వేధిస్తూనే ఉంటాయి.

అయితే వీటన్నిటికీ దూరంగా ఉంటూ ఆరోగ్య‌మైన జీవితాన్ని గ‌డ‌పాలి అనుకుంటే న‌ల‌బై ఏళ్లు దాటిన పురుషులు కొన్నిటికి దూరంగా ఉండాలి.లేదంటే లైఫే రిస్క్‌లో ప‌డుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం న‌ల‌బై ఏళ్లు దాటిన పురుషులు వేటిని ఎవైడ్ చేయాలో చూసేయండి.చక్కెర, చ‌క్కెర‌తో త‌యారు చేసిన స్వీట్లు, బేకరీ పదార్థాల జోలికి అస్స‌లు వెల్ల‌కూడ‌దు.

ఎందుకంటే.వీటిని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క్ర‌మంగా పెరిగి గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తుంది.

Advertisement
Men Over The Age Of 40 Are At Risk For Life If They Take These Details! Men, Men

అలాగే కొంద‌రు టీ, కాఫీల‌ను ప‌రిమితికి మించి తాగుతారు.అయితే న‌ల‌బై ఏళ్లు దాటిన పురుషులు టీ, కాఫీల‌ను అతిగా తీసుకుంటే అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌ర‌చూ ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

అందు వ‌ల్ల టీ, కాఫీల‌ను మితంగా తీసుకోవాలి.లేదంటే వాటిని పూర్తిగా తీసుకోవ‌డం మానేసి హెర్బ‌ల్ టీల‌ను ఎంచుకోవాలి.

న‌ల‌బై ఏళ్లు దాటిన పురుషులు ఉప్పు చాలా అంటే చాలా లిమిట్‌గా వాడాలి.లేదంటే ర‌క్త పోటు అదుపు త‌ప్పుతుంది.

Men Over The Age Of 40 Are At Risk For Life If They Take These Details Men, Men

మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులూ స‌క్ర‌మిస్తాయి.ప్రాసెస్డ్‌ మాంసాన్ని పొర‌పాటును కూడా తీసుకోరాదు.ప్రాసెస్ చేసిన మాంసం గుండె వ్యాధుల‌తో పాటు ప్రాణాంత‌క‌ర క్యాన్స‌ర్‌కి కార‌ణం అవుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇవే కాకుండా.కూల్‌డ్రింక్స్‌, వేయించిన ఆహారాలు, ప్యాక్ చేసిన ఆహారాలు, నూనె ఆహారాలు, మైదా, బాగా పాలిష్ చేసిన బియ్యం, బ్రెడ్‌, ఫాస్ట్ ఫుడ్స్ వంటి వాటికి సైతం దూరంగా ఉంటూ పోష‌కాహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.

Advertisement

అప్పుడే వ‌య‌సు పెరిగినా ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు