Kajal Aggarwal Balakrishna: 63 ఏళ్ల అంకుల్ కి… 38 ఏళ్ల కాజల్ ఆంటీ అయ్యింది.. ఇది మరీ దారుణం?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బాలకృష్ణ (Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈయన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal)హీరోయిన్గా నటించగా శ్రీ లీల (Sreeleela) బాలయ్య కూతురు పాత్రలో నటించారు.

Memes Viral On Kajal Aggarwal Balakrishna Bhagavanth Kesari Movie

ఇక ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ద్వారా కాజల్ కూడా రీ ఎంట్రీలో మంచి విజయం సొంతం చేసుకున్నారని చెప్పాలి.పెళ్లి చేసుకొని కొడుకు పుట్టడంతో కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి కాజల్ బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాలో కాజల్ ను బాలయ్య ఆంటీ( Aunty ) అనే పిలవడం అందరిని పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Memes Viral On Kajal Aggarwal Balakrishna Bhagavanth Kesari Movie
Advertisement
Memes Viral On Kajal Aggarwal Balakrishna Bhagavanth Kesari Movie-Kajal Aggarwa

ఒక సూపర్ మార్కెట్లో కాజల్ బాలయ్య ఎదురుపడగా ఆమెను బాలయ్య బాగున్నారా ఆంటీ అని పిలుస్తారు దీంతో ఒక్కసారిగా కాజల్ ఆంటీ నా అంటూ షాక్ అవుతుంది.అయితే ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ ( Memes ) వైరల్ అవుతున్నాయి.38 సంవత్సరాల కాజల్ అగర్వాల్ ని పట్టుకొని 63 సంవత్సరాల బాలకృష్ణ ఆంటీ అని పిలవడం ఏందయ్యా ఇది మరి దారుణం అంటూ పెద్ద ఎత్తున ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.మరికొందరు ఈ ఫోటోలపై స్పందిస్తూ ఇది అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా కదా ఆ మాత్రం ఉంటుందిలే అంటూ ఫన్నీగా కామెంట్స్ వచ్చేస్తున్నారు.

ఏది ఏమైనా బాలయ్య సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చినటువంటి కాజల్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారని చెప్పాలి.ఈ సినిమా తర్వాత కాజల్ త్వరలోనే సత్యభామ( Satyabhama ) అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ వీడియో భారీ స్థాయిలోనే సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక ఈ సినిమాతో పాటు ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్నటువంటి ఇండియన్ 2( Indian 2 ) సినిమాలో కూడా భాగమయ్యారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు