వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఐరన్ లెగ్ హీరోయిన్

టాలీవుడ్ లో కొంత మంది హీరోయిన్స్ ఎన్ని సినిమాలు చేసిన, స్టార్ హీరోలతో నటించే అవకాశం తెచ్చుకున్న వారు నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు.

సినిమా తీయడంలో దర్శకుడు ఫెయిల్ అయిన అదేదో హీరోయిన్స్ తప్పు అన్నట్లు ఆమెది ఐరన్ లెగ్ అని తప్పు తోసేస్తారు.

ఒకప్పుడు టాలీవుడ్ రమ్యకృష్ణ అలాంటి ముద్ర వేసుకుంది.తరువాత తన ఫేట్ మార్చుకుంది.

Mehreen To Sign A Web Series, Tollywood, Bollywood, Telugu Cinema-వెబ్ �

అదే ముద్ర తాప్సికి కూడా పడింది.దీంతో ఆమె తెలుగు సినిమాలకి దూరమై బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

ఇప్పుడు అలాంటి ముద్ర మెహరీన్ మీద పడింది.ఆమె స్టార్ హీరోలతో నటిస్తున్న ప్రతి సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె మీద ఈ ముద్ర వేసేసారు.

Advertisement

అయిన కూడా ఇప్పటి వరకు అవకాశాలు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్ కి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.బి టౌన్ లో ఇపుడు వెబ్ సిరీస్ లకు మంచి గిరాకీ ఉంది.

బోల్డ్ సీన్స్ లో నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపించడంతో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ ఏర్పడింది.మెహ్రీన్ తమ్ముడు గుర్ఫతే సింగ్ ఫిర్జాదా బాలీవుడ్ లో గిల్టీ అనే వెబ్ సిరీస్ లో నటించాడు.

దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.ఆ పాపులారిటీతోనే గుర్ఫతే తన అక్క మెహ్రీన్ కి ఓ వెబ్ సిరీస్ లో అవకాశం ఇప్పించినట్టు టాక్ నడుస్తోంది.

గతంలో అనుష్క శర్మ నిర్మించిన ఒక సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటించింది.ఈ నేపధ్యంలో ఇప్పుడు వెబ్ సిరీస్ లో కూడా తమ్ముడు కారణంగా అవకాశం వచ్చింది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
నాని, విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో తెలుగు సినిమా స్థాయిని పెంచుతారా..?

నెట్ ఫ్లిక్స్ లో త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తుంది.మరి డిజిటల్ ప్లాట్ ఫాంకి మారిన ఆమె ఫేట్ మారుతుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు