వాట్సప్ ప్రైవసీ పాలసీకి మే 15 డెడ్‌లైన్..!

నేటి సమాజంలో వాట్సప్ గురించి తెలియని వారంటూ లేరు.చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరు వాట్సప్ వాడుతూనే ఉన్నారు.

ఇక వాట్సప్ వాడుకలోకి వచ్చిన దగ్గరి నుండి అనేక ఫీచర్స్ పుట్టుకొచ్చాయి.అయితే రెండు నెలల క్రితం వాట్సప్ ప్రైవసీ పాలసీ పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ప్రైవసీ పాలసీలో కాస్త మార్పులు చేసి కొత్త పాలసీని ప్రకటించింది వాట్సప్.ఈ ప్రైవసీ పాలసీని మే 15 లోపు అంగీకరించాలి.

ఇప్పటికే ఈ పాలసీని అంగీకరించినవారు చేయాల్సిందేమీ లేదు.కానీ ఇంకా వాట్సప్ ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్ చేయనివారికి మరో నెల రోజే గడువుంది.

Advertisement

అయితే ప్రైవసీ పాలసీ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనే సందేహాలు యూజర్లను వెంటాడుతున్నాయి.ఇక వాట్సప్ కొత్త నియమనిబంధనలు అంగీకరించకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

ఇక మే 15 నుడను 120రోజులు మాత్రమే వాట్సప్ పని చేస్తుందన్నారు.ఆ తర్వాత మీ అకౌంట్ లో ఛాట్స్, గ్రూప్స్ అన్ని పోతాయి.

అంతేకాక మీ వాట్సప్ కూడా పని చేయదు.

ఒక్కవేళ మేరీ అదే నెంబర్ మీద వాట్సప్ క్రియేట్ చేయాలి అనుకుంటే మళ్ళి మొదటి నుండి చేయాల్సి వస్తుంది.ఇక అప్పుడు కూడా మీరు కొత్త నిబంధలను ఆగింకరించాల్సి వస్తుంది.ఆ ప్రైవసీ పాలసీ వివాదాస్పదం కావడంతో డెడ్‌లైన్‌ను వెనక్కి తీసుకుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
బర్త్ డే క్వీన్ నవీన రెడ్డి : మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీ లో స్టార్ ఇమేజ్ దక్కించుకున్న నటి...

ఆ తర్వాత ఫిబ్రవరిలో వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించి 2021 మే 15 డెడ్‌లైన్‌గా విధించింది.గతంలో ప్రైవసీ పాలసీ వివాదాస్పదం కావడంతో యూజర్లకు వివరణ కూడా ఇచ్చింది.

Advertisement

అంతేకాదు యాజమాన్యం విషయాలు తెలిపింది.డేటా సెక్యూరిటీ, కమ్యూనికేషన్‌కు సంబంధించిన ప్రైవసీ విషయంలో రాజీ పడట్లేదని తెలిపింది.

కానీ యూజర్ల డేటాను సేకరించడంతో పాటు థర్డ్ పార్టీ సంస్థలతో షేర్ చేసుకుంటామన్న నియమనిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వ్యాపారులతో ఛాట్ చేసేలా, ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకునేలా మార్పులు చేస్తున్నామని, పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌కు డేటా షేర్ చేస్తామని తెలిపింది.

తాజా వార్తలు