తెలంగాణలో భారీగా ఐఏఎస్‎ల బదిలీలు.. !

తెలంగాణలో భారీగా ఐఏఎస్‎ల బదిలీలు జరగనున్నాయి.ఈ మేరకు బదిలీల కసరత్తును సీఎం కేసీఆర్ పూర్తి చేశారు.

ఈ నేపథ్యంలో అధికారిక ఉత్తర్వులు ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉంది.అయితే రాష్ట్రంలో చాలా కాలం తర్వాత ఐఏఎస్ల బదిలీలు జరగనున్నాయి.

నాలుగు సంవత్సరాలుగా ఒకే పోస్టులో పలువురు ఐఏఎస్ లు విధులు నిర్వహిస్తున్నారు.రాష్ట్రంలో ఎన్నికలు రానున్న సమయంలో ఏడాది ముందు కేసీఆర్ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

ఈ బదిలీల తర్వాత జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారని సమాచారం.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు