జాగ్రత్త : మాస్క్ లేకుండా బయటికొస్తే అరెస్ట్ చేస్తాం...

దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా ప్రజలను అవసరమైతే తప్ప అనవసరంగా రోడ్లపై తిరగకూడదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయకుండా రోడ్ల పైకి యధావిధిగా సంచరిస్తున్నారు.

అందువల్ల కరోనా వైరస్ ఒకచోట నుండి మరో చోటుకు వ్యాపిస్తూ పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.దీంతో దేశ ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై నగరంలో నగర పాలక సంస్థ అధికారులు ఓ ముఖ్య నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా అనవసరంగా రోడ్లపై సంచరిస్తున్న వారిని దృష్టిలో ఉంచుకొని మాస్క్ లేకుండా రోడ్డుపై కనిపిస్తే అరెస్టు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు.అంతేకాక వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు.

అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో లో 1221 మంది ఈ కరోనా వైరస్ లక్షణాలతో బాధ పడుతుండగా 60 మందికి పైగా మృతి చెందారు.ఈ వైద్య గణాంకాలను దృష్టిలో ఉంచుకొని ముంబై నగర పాలక సంస్థ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా నగర పాలక సంస్థలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి కొందరు మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.అసలే సామాన్య ప్రజలు గత 15 రోజులుగా ఎటువంటి పనులు లేక తిండి లేక ఇబ్బంది పడుతున్నారని అందువల్ల డబ్బు కోసం పనులకు వెళ్లక తప్పదని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అందరి కళ్ళు ఈ నెల 14వ తారీకు పైనే ఉన్నాయి.అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఈ లాక్ డౌన్ మరింత కాలం పాటు పొడిగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే ఈ  లాక్ డౌన్ ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితులపై పడినట్లు తెలుస్తోంది.ఇలాంటి సమయంలో లాక్ డౌన్ మరింత కాలం పొడిగించే నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని కొందరు ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు