విచారణ లేకుండా రెండేళ్ల జైలు

పోలీసులకు ఎవరిమీదనైనా కోపం వస్తే ఏమనుకుంటున్నావ్‌రా.బొక్కలోకి తోస్తా అంటారు.

అలా బొక్కలోకి అంటే జైల్లోకి తోస్తున్నారు జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరత్‌ ఆలంను.

ఈయన ఈమధ్య జాతీయ మీడియాలో ప్రాచుర్యం పొందాడు.

ఏం సాధించాడని? గత వారం జమ్మూ కశ్మీర్‌లో భారీ ర్యాలీ తీశాడు.అందులో వేర్పాటువాదులు పాకిస్తాన్‌ జెండాలు ఎగరేశారు.

ఇది దేశద్రోహం కదా.వెంటనే సర్కారు ఆయన్ని అరెస్టు చేసింది.ప్రజా భద్రత చట్టం కింద కేసు పెట్టారు.

Advertisement

ఈ చట్టం కింద బుక్‌ చేస్తే ఎలాంటి విచారణ లేకుండా రెండేళ్లపాటు జైల్లో ఉంచే వీలుంది.ముందు ఏదో కొద్దిపాటి కేసు పెట్టినా ఆ తరువాత ఈయన ప్రమాదకరమైన వ్యక్తిగా భావించి విచారణ లేకుండా రెండేళ్లపాటు కటకటాల్లోకి తోయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జమ్మూకశ్మీర్లో పీడీపీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.ఇక్కడ వేర్పాటువాదులు ర్యాలీ తీసి పాక్‌ జెండాలు ఎగరేయగానే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దీంతో మసరత్‌ ఆలంపై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ సర్కారు రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది.అందుకే విచారణ.

గిచారణ జాన్తానై అని రెండేళ్లు బయటకు రాని కేసు పెట్టింది.ప్రభుత్వాలు తలచుకుంటే ఏమైనా చేయగలవు.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
గ్రామ సచివాలయ వ్యవస్థలో కీలక మార్పులు 

మరి ఇది ఇంతకూ మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందా?.

Advertisement

తాజా వార్తలు