మాన్యవర్ కాన్షిరామ్ విగ్రహావిష్కరణకు వేలాదిగా తరలి రావాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో మాన్యవర్ కాన్షిరామ్ విగ్రహ ఆవిష్కరణ ఈనెల 8న ఉన్నందున బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షులు నీరటి భాను ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన పితామహుడు రాజ్యాధికార ప్రదాత మాన్యవర్ కాన్షీరామ్ విగ్రహావిష్కరణకి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించడం జరిగింది.

ఈ సమావేశానికి జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు వరదవెల్లి స్వామి గౌడ్ హాజరై మాట్లాడుతూ 8 తేదీన జరిగే మాన్యవర్ కాన్షీరాం విగ్రహావిష్కరణ కర్తగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్న సందర్భంగా ఈ మండలం నుంచి విగ్రహావిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలని పిలుపునివ్వడం జరిగింది.

మాన్యవర్ కాన్షీరామ్ భారతదేశంలోని 1987లో ఏప్రిల్ 14 న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజున బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఓట్లు మావి సీట్లు మీవా అనే నినాదాలు తీసుకొని భారతదేశ మంత తిరిగి అనాదికాలంలోనే భారతదేశంలోనే జాతీయస్థాయిలో మూడవ జాతీయ పార్టీగా ఆవిర్భవించడం జరిగిందన్నారు.అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ లో మాయావతి ని ముఖ్యమంత్రిని చేసి భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంస్కరణలు చేపట్టి 27 లక్షల ఎకరాల భూ పంపిణీ చేయడం జరిగిందని, అంతేకాకుండా భారతదేశంలో ఏదైనా సమస్య ఉన్నదంటే అది బీసీల సమస్యనని నొక్కి చెప్పి ఆ రోజుల్లో ఉన్న ప్రధానమంత్రి విపి సింగ్ హయాంలో బీసీలకు అప్పటివరకు ఉన్నటువంటి రిజర్వేషన్ లను 208 శాతం పెంచి చట్టసభలలో ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మాన్యవర్ కాన్సిరాం అని అలాంటి మహనీయుని విగ్రహాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా సుద్దాల గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

కావున మండలంలోని ప్రజలు అలాగే జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాకుండా అగ్రవర్ణ పేదలు, విద్యార్థులు,మేధావులు, కర్షకులు,కార్మికులు, కళాకారులు, మహిళా సంఘాలు, మహిళా సోదరీమణులు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వేలాదిగా తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి యారపు రాజబాబు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు మాజీ ఎంపిటిసి తాటిపల్లి అంజన్న, ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్,మండల ఉపాధ్యక్షులు నేలకంటి లక్ష్మీరాజ్యం,మండల కార్యదర్శి ఈశ్వర్, కిషన్,అజిత్,నేవూరి శ్రీనివాస్ రెడ్డి,భార్గవ్,నవీన్ తదితరులు పాల్గొనడం జరిగింది.

ఢిల్లీలో ధర్నా : అందరినీ ఏకం చేస్తున్న జగన్ 
Advertisement

Latest Suryapet News